Tuesday, 3 November 2026

దోచుకోవడం కోసమే జగన్‌ సమైక్య సభ : మంత్రి సారయ్య

హైదరాబాద్‌ : రాష్ట్రాన్ని దోచుకోవడం కోసమే జగన్‌ సమైక్యసభ అని మంత్రి బస్వరాజు సారయ్య వరంగల్‌లో అన్నారు. తండ్రి మాటపై విశ్వాసం లేని జగన్‌ మాటలను సీమాంధ్ర ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరని ఆయన తెలిపారు. సమైక్య రాష్ట్రాన్ని తెలంగాణ ప్రజలు కోరడం లేదని ఆయన అన్నారు. యూ టర్న్‌ తీసుకున్న నేతలను ప్రజలు గమనిస్తున్నారని ,వారికి ప్రజలు గుణపాఠం చెబుతారని మంత్రి వ్యాఖ్యానించారు. తెలంగాణ ప్రాంతంలో వైకాపా కనుమరుగైందని …. ఆ పార్టీలో కొనసాగితే తల్లిదండ్రులు కూడా క్షమించరని అన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *