Tuesday, 3 November 2026

జనగామ టికెట్ నాకే ఇవ్వాలి ….

గోడపత్రికలను ఆవిష్కరించిన భరోసా నాయకులు జల్లి సిద్ధయ్య జనగామ ( జనం సాక్షి)సెప్టెంబర్2:రానున్న ఎన్నికల్లో కెసిఆర్ ముచ్చటగా మూడోసారి గెలవాలని,జనగామలో బారాస విజయ డంకా మోగించాలని బారాస రాష్ట్ర నాయకులు జల్లి సిద్దయ్య అన్నారు. స్థానిక ఆర్ అండ్ బి అతిథి గృహంలో మద్దతు దారులతో కలిసి కేసీఆర్ మూడోసారి ముఖ్యమంత్రి కావాలని తనకే టికెట్ కేటాయించాలని కోరుతూ ముద్రించిన గోడపత్రికలను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఈ ప్రాంత ప్రజల ఆలోచనలు సమస్యలను ఆకలింపు చేసుకునే వ్యక్తులకే జనగామ ఎమ్మెల్యే టికెట్ కేటాయించాలని లోకల్ అని చెప్పుకోవడమే కాకుండా పోరాటాలను దృష్టిలో పెట్టుకొని ఆకాశం ఇవ్వాలని అన్నారు.నిన్న మొన్న పార్టీలోకి వచ్చిన వారు పదవులు అనుభవిస్తున్నారని తెలంగాణ రాష్ట్రం కోసం కష్టపడి తెలంగాణ సాధించిన వారి పోరాట పటిమని గుర్తించి,పోరాడిన వారిని గుర్తించి టికెట్ ఇవ్వాలన్నారు. పాలకుర్తి టికెట్ ఇచ్చిన తర్వాత కేసీఆర్ వారి హామీ మేరకు నేను పోటీ నుంచి వైదొలిగిన సంగతి మీకు తెలిసిన విషయమే.. ఈ ప్రాంత ప్రజల సమస్యల పట్ల అవగాహన ఉన్న వ్యక్తిగా తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ని ఒకసారి జనగామ ఎమ్మెల్యేగా అవకాశం ఇవ్వాలని కోరారు.కేసీఆర్ వెన్నంటే ఉండి అనేక ఉద్యమాలు చేసిన రాజకీయ ప్రస్థానం తనకున్నదని,కావున కెసిఆర్ జనగామ టికెట్ పై పునరాలోచన చేసి జనగామ ఎమ్మెల్యే టికెట్ తనకే ఇవ్వాలని మరియు వారే మూడవసారి ముఖ్యమంత్రి పదవి చేపట్టాలని కోరారు.ఈ కార్యక్రమంలో నాయకులు విజయ్ కుమార్, సారంగపాణి ,ఆరేళ్ల హరి రాములు ,అశోక్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.