Wednesday, 4 November 2026

బోవేరా జయంతి ఉత్సవాల్లో జెడ్పీ చైర్మన్‌

జనంసాక్షి, మంథని : ప్రముఖ స్వాతంత్య్ర సమరయోధుడు, కరీంనగర్‌ గాంధీ స్వర్గీయ బోయినపల్లి వెంకటరామారావు జయంతి ఉత్సవాలకు బీఆర్‌ఎస్‌పార్టీ మంథని ఎమ్మెల్యే అభ్యర్థి, పెద్దపల్లి జిల్లా పరిషత్‌ చైర్మన్‌ పుట్ట మధూకర్‌ హజరయ్యారు. కరీంనగర్‌లో జరిగిన బోవేరా జయంతి ఉత్సవాలకు శాసనమండలి చైర్మన్‌ సిరికొండ మధుసుధనాచారీ, ప్రముఖ పాత్రికేయులు దేవులపల్లి అమర్‌, ప్రగతిశీల ప్రజా వాగ్గేయురాలు విమలక్కతో కలిసి ఆయన పాల్గొన్నారు. ఈ సందర్బంగా బోవేరా చిత్రపటానికి పూలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం బోవేరా తనయుడి సమక్షంలో జిల్లా పరిషత్‌ చైర్మన్‌ పుట్ట మధూకర్‌ను శాసనమండలి చైర్మన్‌ మధుసుధనా చారీ చేతుల మీదుగా సన్మానం చేశారు.