బీజేపీ టికెట్ ఆశిస్తూ కేంద్ర మంత్రి కిషన్ రెడ్డికి సురేష్ గౌడ్ వినతి

చేర్యాల (జనంసాక్షి) సెప్టెంబర్ 02 : బీజేపీ జనగామ టికెట్ ఆశిస్తూ కేంద్ర మంత్రి కిషన్ రెడ్డికి బిజెపి సిద్దిపేట జిల్లా ప్రధాన కార్యదర్శి బూరుగు సురేష్ గౌడ్ వినతి పత్రం సమర్పించారు. శనివారం హైదరాబాద్ లోని కిషన్ రెడ్డి నివాసంలో మర్యాదపూర్వకంగా కలిసి వినతిపత్రం అందజేశారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. త్వరలో జరగబోయే శాసనసభ ఎన్నికలలో జనగామ నియోజకవర్గానికి సంబంధించిన సీటును చేర్యాల మండలం నుంచి బిసి వర్గానికి చెందిన గౌడ సామాజిక వర్గానికి చెందిన తమకు కేటాయించాలని 25 సంవత్సరాలనుండి పార్టీకి ఎంతో సేవ చేశానని విద్యార్థి పరిషత్(ఏబీవీపీ) నుండి అంచే లంచాలుగా ఎదుగుతూ ఉమ్మడి వరంగల్ జిల్లా బీజేవైఎం అధ్యక్షులుగా ప్రధాన కార్యదర్శిగా జనగామ నియోజకవర్గ అసెంబ్లీ కన్వీనర్ గా తెలంగాణ రాష్ట్ర అధికార ప్రతినిధిగా బాధ్యతలు నిర్వహిస్తూ ప్రస్తుతం బిజెపి సిద్దిపేట జిల్లా ప్రధాన కార్యదర్శిగా కొనసాగుతూ జనగామ నియోజకవర్గానికి సంబంధించిన సిద్దిపేట జిల్లాలో ఉన్న చేర్యాల,చేర్యాల రూరల్, మద్దూరు,కొమురవెల్లి, దుల్మిట్ట మండలాల్లో పార్టీని బలోపేతానికి కృషి చేస్తూ స్థానిక ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి చేసిన భూకబ్జాలను బయటపెట్టినందుకు ఎన్నోసార్లు జైలుకు వెళ్లడం జరిగిందని, అహర్నిశలు పార్టీ కోసం పనిచేసే తమకు జనగామ నియోజకవర్గ బిజెపి టికెట్ కేటాయించాలని కోరారు. ఈవిషయమై కిషన్ రెడ్డి స్పందించి తప్పకుండా అవకాశం కల్పిస్తామని హామీ ఇచ్చినట్లు తెలిపారు. నియోజకవర్గంలో పని చేస్తూ ప్రజలకు అందుబాటులో ఉంటూ ప్రజల్లో నిమగ్నమై ఉండాలని, బిఆర్ఎస్ పార్టీ చేస్తున్న అవినీతికి అడ్డుకట్ట వేయడానికి పోరాటం చేయాలని సూచించినట్లు తెలిపారు.

తాజావార్తలు