బిజెపి రాష్ట్ర అధ్యక్షుడిని కలిసిన ఆరె కులస్తులు వేములవాడ గ్రామీణం
సెప్టెంబర్ 4 (జనంసాక్షి): బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డికి సోమవారం ఆరె కులస్తుల ఆధ్వర్యంలో వినతి పత్రం సమర్పించారు.ఆరె కులస్తులకు ఓబీసీ సర్టిఫికెట్ ఇప్పించేలా కేంద్ర ప్రభుత్వం జీవో విడుదల చేసేలా చూడాలని ఆయనను కోరినట్లు వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో రాజన్న సిరిసిల్ల జిల్లా కమిటీ సభ్యులు శిలువేని మల్లేశం, సూర దేవరావు, ఎన్డ్రాల అశోక్, మొకిలి విజేందర్, ఎన్డ్రాల రాజు, కోలే అంజిబాబు, మంజిడి గోపాల్, సత్యం, సంజీవ్ తదితరు పాల్గొన్నారు.