ఓటు హక్కు ద్వారా నవ సమాజ నిర్మాణం
– మంథని ఆర్డీవో హనుమా నాయక్
జనంసాక్షి , మంథని : ఓటు హక్కు ద్వారానే నవ సమాజ నిర్మాణం జరుగుతుందని మంథని ఆర్డిఓ హనుమా నాయక్ అన్నారు. మంగళవారం మంథని పట్టణంలో ప్రభుత్వ జూనియర్ బాలుర కళాశాలలో ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడుతూ.. ఉపాధ్యాయుల వల్ల దేశం అభివృద్ధి చెందుతే ఓటర్ల వల్ల నవ సమాజ నిర్మాణం జరుగుతుందని, అర్హులైన ప్రతి ఒక్కరూ ఓటు హక్కుకు దరఖాస్తు చేసుకోవాలని విద్యార్థుల ఉద్దేశించి ఆయన ప్రసంగించారు. ఈ కార్యక్రమంలో తహసిల్దార్ దండిగా రాజయ్య, ఏవో రవీందర్, డిప్యూటి తహశీల్దార్ సంతోస్ ఠాకూర్, ప్రిన్సిపాల్ ఉష , రెవెన్యూ సిబ్బంది, అధ్యాపకులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.