ప్రతి వ్యక్తి జీవితంలో గురువుల పాత్ర కీలకమైనది

వరంగల్ ఈస్ట్, సెప్టెంబర్ 5 (జనం సాక్షి)

ప్రతి వ్యక్తి జీవితంలో గురువుల పాత్ర కీలకమైనదని తాళ్ల పద్మావతి ఫార్మసీ కళాశాల చైర్మన్ తాళ్ల మల్లేశం అన్నారు. మంగళవారం డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణ జయంతి సందర్భంగా కళాశాలలో ఉపాధ్యాయ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా మల్లేశం మాట్లాడుతూ తల్లి తండ్రి తర్వాత గురువు ముఖ్యమని అన్నారు. గురువు జ్ఞాన ప్రదత అన్నారు.సమాజం అన్ని రంగాలలో ఎదగాలన్న దేశం అన్ని విధాలుగా అభివృద్ధి చెందాలన్నా గురువు సూచించిన మార్గంలో వెళ్లడంతోపాటు ఒక క్రమశిక్షణమైన జీవితాన్ని గురువు అందిస్తాడన్నారు. ఈ సందర్భంగా పలువురు గురువులను ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ వెంకటేశ్వరరావు, కళాశాల డైరెక్టర్ వరుణ్ వైష్ణవి ఇతర ఉపాధ్యాయ బృందం పాల్గొన్నారు.

తాజావార్తలు