సఫిల్ గూడ రైల్వే గేటు తెరిపించాలని డిఆర్ఎం కు కార్పొరేటర్ వినతి.
మల్కాజిగిరి.జనంసాక్షి.సెప్టెంబర్ 5:
గత కొన్ని రోజులుగా మూసి ఉన్న సఫిల్ గూడా రైల్వే గేటును తెరిపించాలని కాలనీ వాసులతో కలిసి మల్కాజిగిరి కార్పొరేటర్ శ్రావణ్ కుమార్ దక్షిణ మధ్య రైల్వే హైదరాబాద్ డివిజన్ మేనేజర్ లోకేష్ విస్నోయిని కలిసి వినతి పత్రాన్ని అందజేసి స్థానికులు ఎదుర్కొంటున్న సమస్యలను ఆయన దృష్టికి తీసుకువచ్చారు.ఈసందర్భంగా కార్పొరేటర్ మాట్లాడుతూ.గత కొన్ని రోజులుగా మూసి ఉన్న సఫిల్ గూడ రైల్వే గేట్ తో బలరాం నగర్,వెస్ట్ కృష్ణానగర్,సీతారాం నగర్,దేవినగర్, సైనిక్ నగర్,ఆర్కే పురం విలేజ్,ఓల్డ్ సఫిల్ గూడా,ఎల్బీనగర్,న్యూ విద్యానగర్, వినాయక నగర్ ప్రాంత ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని డ్రాఫ్ట్ డ్రాయింగ్ చూపించామని దీంతో పాటు కేంద్ర పర్యాటక శాఖ మంత్రి కిషన్ రెడ్డి దృష్టికి తీసుకువెళ్లిన వినతి పత్రాన్ని ఆయనకు అందజేసి తమరు ప్రత్యక్షంగా చూసి రైల్వే గేట్ ను తెరిపించాలని కోరమన్నారు.సానుకూలంగా స్పందించిన ఆయన సంబంధిత అధికారులతో చర్చించి రైల్వే గేటును తెరిపించేందుకు కృషి చేస్తానని హామీ ఇచ్చారని తెలిపారు.ఈ కార్యక్రమంలో సీనియర్ డివిజనల్ ఇంజనీర్ మల్లికార్జున్,కొమరాజు,
శశికాంత్,రామకృష్ణ,బిటి శ్రీనివాస్
తదితరులు పాల్గొన్నారు.