అభివృద్ధి పనులు, సంక్షేమ పథకాలకు ఆకర్షితులై BRS పార్టీలో చేరికలు

ఫోటో రైట్ అప్: బిఆర్ఎస్ పార్టీలో చేరుతున్న బీఎస్పీ పార్టీకి చెందిన యువకులు
చొప్పదండి ,సెప్టెంబర్ 6 (జనం సాక్షి): తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న ప్రజా సంక్షేమ పథకాలకు ఆకర్షితులై వివిధ పార్టీల నుంచి నాయకులు యువకులు, బిఆర్ఎస్ పార్టీలోకి చేరుతున్నారని ఎమ్మెల్యే సుంకే రవిశంకర్ పేర్కొన్నారు.చొప్పదండి మండలం రుక్మాపూర్ గ్రామనికి చెందిన 50 మంది BSP నాయకులు చొప్పదండి ఎమ్మెల్యే సుంకే రవిశంకర్ అధ్వర్యంలో బూరుగుపల్లి లోని ఎమ్మెల్యే నివాస గృహంలో ఎమ్మెల్యే సమక్షంలో టిఆర్ఎస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ దేశంలో ఎక్కడా లేనివిధంగా సంక్షేమ పథకాలు ప్రవేశపెడుతున్న ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వం అని వచ్చే ఎన్నికల్లో మరోమారు రాష్ట్ర ముఖ్యమంత్రిగా కేసిఆర్ ను చేసేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని పేర్కొన్నారు. బీఆర్ఎస్ పార్టీ బలోపేతానికి అహర్నిశలు కష్టపడి సంక్షేమ పథకాలను గడప గడపకు తీసుకెళ్లాలని కోరారు కార్యక్రమంలో టిఆర్ఎస్ పార్టీ మండల శాఖ అధ్యక్షుడు వెల్మ శ్రీనివాస్ రెడ్డి డిఆర్ఎస్ యువజన విభాగం నియోజకవర్గం ఇంచార్జ్ బంధారపు అజయ్ కుమార్ గౌడ్, కొండగట్టు దేవస్థానం డైరెక్టర్ గను శ్రీనివాస్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.

తాజావార్తలు