Wednesday, 4 November 2026

నూతన వధూవరులను ఆశీర్వదించిన మెదక్ పార్లమెంట్ సభ్యులు కొత్త ప్రభాకర్ రెడ్డి

దౌల్తాబాద్ సెప్టెంబర్ 7, జనం సాక్షి:దౌల్తాబాద్ మండల కేంద్రంలోని విఆర్ఆర్ ఫంక్షన్ హాల్లో శేరిపల్లి బందారం గ్రామానికి చెందిన గ్రామ రైతుబంధు అధ్యక్షుడు జోడు నాగులు కుమార్తె వివాహానికి హాజరై నూతన వధూవరులను మెదక్ పార్లమెంట్ సభ్యులు, దుబ్బాక అసెంబ్లీ బిఅర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి కొత్త ప్రభాకర్ రెడ్డి ఆశీర్వాదించారు .ఈ కార్యక్రమం లో బి ఆర్ ఎస్ పార్టీ మండల అధ్యక్షులు రణం శ్రీనివాస్ గౌడ్,ఎంపీటీసీ జోడు నవీన్ కుమార్, పిఎసిఎస్ డైరెక్టర్ బుడ్డ రమేష్,పట్టణ అధ్యక్షులు ఉమ్మడి నర్సింహారెడ్డి,సీనియర్ నాయకులు యాదవరెడ్డి, డాకూరి చంద్రం,తదితరులు పాల్గొన్నారు.