కమిషన్ల ప్రభుత్వాన్ని గద్దె దించేందుకు సిద్ధం కండి

* రాష్ట్రంలో అధికారంలోకి వచ్చేది కాంగ్రెస్ పార్టీనే
*ఈ నెల 17 న సోనియా గాంధీ చేతులమీదుగా ఐదు డిక్లరేషన్ ల విడుదల…
– కాంగ్రెస్ శ్రేణులకు పిలుపునిచ్చిన బత్తుల లక్ష్మారెడ్డి..              – హనుమాన్ పేట ఫ్లైఓవర్ నుండి  ఇది కూడా సుందరయ్య చౌరస్తా వరకు భారీ పాదయాత్ర…
మిర్యాలగూడ, జనం సాక్షి.  తెలంగాణ రాష్ట్రంలో కమిషన్ల రాజ్యాన్ని గద్దె దించేందుకు కాంగ్రెస్ శ్రేణులు అందరూ  నడుం కట్టాలని కాంగ్రెస్ పార్టీ మున్సిపల్ మున్సిపల్ ఫ్లోర్ లీడర్ బత్తుల లక్ష్మారెడ్డి పిలుపునిచ్చారు.  గురువారం సాయంత్రం జాతీయ కాంగ్రెస్ నాయకులు రాహుల్ గాంధీ జోడో యాత్ర ప్రారంభించి నేటికీ సంవత్సరం పూర్తి అయిన సందర్భంగా  ఏఐసిసి పిలుపుమేరకు పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు నూకల వేణుగోపాల్ రెడ్డి ఆధ్వర్యంలో స్థానిక హనుమాన్ పేట ఫ్లైఓవర్ బ్రిడ్జి నుండి ఈదులగూడెం పుచ్చలపల్లి సుందరయ్య  చౌరస్తా వరకు వేలాదిగా తరలివచ్చిన కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తల అభిమానుల తో పాదయాత్ర లో ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి ఆయన మాట్లాడుతూ రాహుల్ గాంధీ  జుడోయాత్ర సెప్టెంబర్ 7 2022 న మొదలై కన్యాకుమారి నుండి కాశ్మీర్ వరకు 146 రోజులు 5000 కిలోమీటర్లు నడిచి ప్రజల కష్టాలు బాధలు తెలుసుకుని ప్రపంచ చరిత్రలోనే ఒక నూతన అధ్యాయాన్ని సృష్టించిన అగ్ర నాయకులు బడుగు బలహీన వర్గాల అభివృద్ధి కొరకు అహర్నిశలు ఆలోచించే అభ్యున్నతవాది రాహుల్ గాంధీ అని అన్నారు. ఈ సందర్భంగా రాహుల్ గాంధీకి  హృదయపూర్వక శుభాకాంక్షలు మిర్యాలగూడ నియోజకవర్గ ప్రజల తరఫున తెలియజేస్తున్నామని ఆ మధుర జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటూ నేడు రాహుల్ గాంధీ జూడయాత్రతోనే కేంద్రంలో భారతీయ జనతా పార్టీ పతనం, తెలంగాణలో టిఆర్ఎస్ పార్టీ పతనం ఖరారు అయిందని,దేశంలో బిజెపి…  రాష్ట్రంలో  బిఆర్ఎస్ రెండు పార్టీలు ఒకటేనని వారివి అన్నీ చీకటి ఒప్పందాలు ఉంటాయని ప్రజలు అన్నీ గమనిస్తున్నారని అన్నారు.ఈ నెల 17 న హైదరాబాద్ లో జరిగే ప్లీనరీ సమావేశంలో కాంగ్రెస్ పార్టీ జాతీయ నాయకురాలు సోనియాగాంధీ చేతుల మీదుగా  రాష్ట్ర అభివృద్ధికి సంబంధించిన ఐదు డిక్లరేషన్ లను విడుదల చేస్తారన్నారు. అదేవిధంగా మిర్యాలగూడ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ జెండా ఎగురవేయటం ఎప్పుడో ఖరారు అయిందని ధీమా వ్యక్తం చేశారు. మజ్జిగ పంపిణీ చేసే వ్యక్తిగా  చిల్లర ప్రచారం చేస్తున్న వారికి త్వరలో సరైన గుణపాఠం నేర్పుతామని  హెచ్చరించారు.  ఈ కార్యక్రమంలో వేములపల్లి ఎంపీపీ సునీత కృపయ్య, పిసిసి సభ్యులు చిరుమర్తి కృష్ణయ్య, పగిడి రామలింగయ్య యాదవ్, డిసిసి ప్రధాన కార్యదర్శి చిలుకూరి బాలు, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు పొదిల శ్రీనివాస్, తమ్మడబోయిన అర్జున్, కౌన్సిలర్లు దేశిడి శేఖర్ రెడ్డి, గంధం రామకృష్ణ క్రికెటర్ జానీ మూఈస్ ఎంపీటీసీలు బెజ్జం సాయి, ఇజ్రాయిల్ సర్పంచులు బంటు కిరణ్ అంజిరెడ్డి, యువజన కాంగ్రెస్ నాయకులు అజహర్,సిద్దు నాయక్, ఇన్చార్జులు పాతూరి ప్రసాద్, గోదాల జానకి రామ్ రెడ్డి, కోడి రెక్క ఇంద్ర కుమార్, అంజి, బంటు, కిషన్ నాయక్, సారెడ్డి శంకర్ రెడ్డి, మాజీ సర్పంచులు ఎంపీటీసీలు వార్డ్ ఇన్చార్జులు మరియు బిఎల్ఆర్ బ్రదర్స్ తదితరులు పాల్గొన్నారు

తాజావార్తలు