ఎమ్మెల్యే రవీంద్ర కుమార్ ఆధ్వర్యంలో బిఆర్ఎస్ పార్టీలో భారీ చేరికలు
దేవరకొండ సెప్టెంబర్ 16 జనం సాక్షి :-ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి పథకాలకు ఆకర్షతులై బిఆర్ఎస్ పార్టీలో చేరికలు జరుగుతున్నాయి అని దేవరకొండ శాసన సభ్యులు, బిఆర్ఎస్ పార్టీ నల్గొండ జిల్లా అధ్యక్షులు రమావత్ రవీంద్ర కుమార్ తెలిపారు.శనివారం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో దేవరకొండ మండలం తాటికోల్ గ్రామానికి చెందిన100 ఎమ్మెల్యే రవీంద్ర కుమార్ సమక్షంలో బిఆర్ఎస్ పార్టీలో చేరారు. వారికి గులాబీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 22 ఏండ్ల రాజకీయ ప్రస్థానం ఉన్న బీఆర్ఎస్ పార్టీ తిరుగులేని రాజకీయ శక్తిగా మారడంతో పాటు దేశ రాజకీయాలను ప్రభావితం చేస్తున్నదని అన్నారు.తెలంగాణ రథసారథి సీఎం కేసీఆర్ మరో ప్రస్థానానికి నాంది పలికారని అన్నారు.ఈ కార్యక్రమంలో జడ్పీటీసీ సలహాదారుడు మారుపాకుల సురేష్ గౌడ్,వైస్ ఎంపీపీ చింతపల్లి సుభాష్,బీఆర్ఎస్ మండల అధ్యక్షులు TVN రెడ్డి,పల్స కోటం గౌడ్,గౌని సత్యనారాయణ,ఎరుకలి లక్ష్మీనారాయణ,జానకిరమా రావు,జూలూరు రమేష్,సామల దశరథ,తదితరులు పాల్గొన్నారు