కాంగ్రెస్ అంటే భయంతో నే ముందస్తు అరెస్టులు.
వనపర్తి జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు
__యం. రాజేంద్రప్రసాద్ యాదవ్
వనపర్తి బ్యూరో సెప్టెంబర్ 16 (జనం సాక్షి).
సీఎం కెసిఆర్ పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్ట్ ఓపెనింగ్ చేయడానికి వస్తున్న సందర్భంగా రంగారెడ్డి పాలమూరు ప్రాజెక్ట్ లో పనులు ఇంకా పెండింగ్ లో ఉన్నాయి ,అయినా సరే ఎలక్షన్లు దగ్గర ఉన్నాయి కాబట్టి కెసిఆర్ కొత్త నాటకాలకు తెరలేపుతున్నారు .
అని వారి సభ కోసం విద్యార్థులకు మూడు రోజులపాటు సెలవులు ప్రకటించి విద్యార్థుల జీవితాలతో చెలగాటమాడుతున్నారు. అని కచ్చితంగా రేపు ఎన్నికల్లో ఈ ప్రభుత్వానికి బుద్ధి చెప్తామని యం. రాజేంద్రప్రసాద్ యాదవ్ మాట్లాడడం జరిగింది.
పోలీస్ సిబ్బంది చేత కాంగ్రెస్ నాయకులను అక్రమ అరెస్ట్ చేసి స్థానిక పోలీస్ స్టేషన్ లకు తరలించడం నిజంగా కెసిఆర్ ప్రభుత్వ చేతకానితన్నానికి నిదర్శనం అని మీ అక్రమ అరెస్టులకు కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎవ్వరు భయపడరు అని రేపు జరగపోయే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఘన విజయం సాధించడం తద్యం అని ఆయన ప్రభుత్వని హెచ్చరించడం జరిజరిగింది.