Saturday, 7 November 2026

ప్రత్యేక రాష్ట్రం వల్లే అనేక సంక్షేమ పథకాలు
పంచాయతీ భవనం ప్రారంభోత్సవంలో షిండే

బిచ్కుంద సెప్టెంబర్ 16 (జనంసాక్షి) మన రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ సాధించిన ప్రత్యేక రాష్ట్రం వల్లనే ప్రత్యేక గ్రామ పంచాయతీలు ఏర్పాటు చేసుకొని నూతన భవనాలు ఏర్పాటు చేసుకుంటున్నామని తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ ప్యానల్ స్పీకర్ జుక్కల్ నియోజకవర్గ ఎమ్మెల్యే హన్మంత్ షిండే అన్నారు. కామారెడ్డి జిల్లా జుక్కల్ నియోజకవర్గం బిచ్కుంద మండలము పత్లాపూర్ గ్రామంలో జుక్కల్ శాసనసభ్యుడు హన్మంత్ షిండే శనివారం రోజు నూతన గ్రామపంచాయతీ భవనం ప్రారంభోత్సవం చేశారు. ఈ భవన నిర్మాణానికి 20, 00,000 లక్షల నిధులతో భవన నిర్మాణం చేశారు. అదే విధంగా గ్రామంలో కొన్ని కాలనీలలో సీసీ రోడ్లకు, డ్రైనేజీలకు, హనుమాన్ ఆలయ ప్రహరీ గోడ నిర్మాణానికి నిధులు మంజూరు చేయాలని సర్పంచ్ అరుణ్ కుమార్ తెలుపగా ఎమ్మెల్యే హన్మంత్ షిండే స్పందించి తప్పకుండా నిధులు మంజూరు చేస్తానని హామీ ఇచ్చారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తోందని పేర్కొన్నారు. ఇప్పటివరకు తమ హయాంలో జరిగిన అభివృద్ధి సంక్షేమ పథకాల గురించి వివరించి తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేతో పాటు ఎంపీపీ అశోక్ పటేల్, మార్కెట్ కమిటీ చైర్మన్ నాగనాథ్ పటేల్, రైతు సమన్వయ సమితి అధ్యక్షుడు బస్వరాజ్ పటేల్, పాషా సేట్, స్థానిక ఎంపీటీసీ జయశీల యాదవ్, మాజీ కొఆప్షన్ సభ్యుడు బాబా, ఉప సర్పంచ్ శివకాంత్ ఎంపీటీసీ పోరం అధ్యక్షుడు సిద్ధిరాంపటేల్ వివిధ గ్రామాల సర్పంచ్లు ఎంపీటీసీలు గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు.