అంగన్వాడీల సమస్యలను సీఎం దృష్టికి తీసుకువెళ్లాలి
జనంసాక్షి, మంథని : తెలంగాణ అంగన్వాడీ టీచర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ సిఐటియు ఆధ్వర్యంలో అంగన్వాడి ఉద్యోగుల సమస్యలను ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువెళ్లాలని మంథని ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ వద్ద ఉద్యోగులు ధర్నా చేసి వినతి పత్రం ఇవ్వడం జరిగింది .గత ఐదు రోజులుగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అంగన్వాడి ఉద్యోగులు సమ్మె చేస్తున్న క్రమంలో రాష్ట్ర ప్రభుత్వం స్పందించకపోవడంతో ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీసుల వద్ద ధర్నాలు చేయాలని రాష్ట్ర కమిటీ పిలుపులో భాగంగా అంగన్వాడి ఉద్యోగులు తరలివచ్చారు. గత 40 సంవత్సరాలుగా గర్భిణీ బాలింతలకు పిల్లలకు ఐసిడిఎస్ సేవలు అందిస్తున్న అంగన్వాడి ఉద్యోగులకు కనీస వేతనం 26 వేల రూపాయలు చెల్లించాలని ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని వేతనంలో సగం పెన్షన్ సౌకర్యం కల్పించాలని గ్రాట్యూటీ చెల్లించాలని పని భారం తగ్గించాలని పై సమస్యలను ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువెళ్లాలని ఎమ్మెల్యే కి మంథని నియోజకవర్గం అంగన్వాడీ టీచర్లు ఆయాలు విజ్ఞప్తి చేయడం జరిగింది. రాష్ట్ర ప్రభుత్వం స్పందించకుంటే సమ్మెను ఉధృతం చేస్తామని నాయకులు అన్నారు. ఈ కార్యక్రమ అంగన్వాడీ యూనియన్ నాయకులు జి జ్యోతి, వనజరాణి ,కే శోభ హరిత ,సులోచన కృష్ణకుమారి స్వరూప, రాధా, అంగన్వాడి టీచర్లు ఆయాలు పాల్గొన్నారు.