ఎమ్మెల్యేగా రవీంద్ర కుమార్ హాట్రిక్ విజయం ఖాయం :- దేవరకొండ మున్సిపాలిటీ వైస్ చైర్మన్ మొహమ్మద్ రహత్ అలీ
దేవరకొండ సెప్టెంబర్ 19 జనం సాక్షి
దేవరకొండ ఎమ్మెల్యేగా రమావత్ రవీంద్ర కుమార్ హ్యాట్రిక్ విజయం సాధించడం ఖాయమని మున్సిపల్ వైస్ చైర్మన్ మొహమ్మద్ రహత్ అలీ పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ
దేవరకొండ నియోజకవర్గo సమగ్రాభివృద్ధికి నిదర్శనంగా నిలిచిందని, నియోజకవర్గ ప్రజలకు అన్ని మౌలిక వసతులు కల్పిస్తున్న దేవరకొండ శాసనసభ్యులు, బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు రమావత్ రవీంద్ర కుమార్ మంత్రి గుంతకండ్ల జగదీశ్వర్ రెడ్డి, నియోజకవర్గ ప్రజల ఆశీస్సులు మెండుగా ఉన్నాయన్నారు. మూడో సారి ఎమ్మెల్యే అభ్యర్థిగా ఎంపిక చేసిన సీఎం కేసీఆర్ కి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. నిరంతరం దేవరకొండ నియోజకవర్గ ప్రజానీకానికి అందుబాటులో ఉండి నియోజకవర్గ అభివృద్ధికి తన శాయశక్తుల కృషి చేస్తున్నారన్నారు. దేశంలో ఎక్కడ లేని విధంగా కెసిఆర్ ఎన్నో సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టి ప్రజలకు అండగా నిలిచారని అన్నారు. ఎమ్మెల్యే రమావత్ రవీంద్ర కుమార్ మైనారిటీలకు అండగా ఉండి పేదింటి ముస్లిం ఆడబిడ్డలను షాదీ ముబారక్ ను అందించడమే కాకుండా,
ఎంతో కాలంగా మరమ్మత్తులకు నోచుకోని ఖాబ్రాస్తాన్, షాది ఖానాలు, మస్జిదు మరియూ ఈద్గాలకు అభివృద్ధికి నిధులు కేటాయించడం చాలా సంతోషకరమన్నారు. బిఆర్ఎస్ ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి మరియు సంక్షేమ పథకాలను చూసి రవీంద్ర కుమార్ సమక్షంలో నిత్యం వందలాది మంది బిఆర్ఎస్ గూటికి చేరుతున్నారన్నారు. కార్యకర్తలు
బీఆర్ఎస్ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ, అభివృద్ధి పథకాలు ప్రజలకు వివరించాలన్నారు. దేవరకొండలో సుస్థిర పాలన కేవలం రవీంద్ర కుమార్ కి మాత్రమే సాధ్యమని రానున్న ఎన్నికల్లో ప్రతి ఒక్కరు రవీంద్ర కుమార్ కి అండగా ఉండి విజయమే లక్ష్యంగా పనిచేసి బిఆర్ఎస్ బలోపేతానికి సైనికుల్లా పని చేయాలన్నారు.




