Thursday, 5 November 2026

మండల స్థాయిలో ఆదర్శ విద్యార్థుల ప్రతిభ.

దౌల్తాబాద్ సెప్టెంబర్ 19, జనం సాక్షి.

దౌల్తాబాద్ మండల పరిధిలో మహాత్మ జ్యోతిరావు పూలే పాఠశాలలో నిర్వహించిన మండల స్థాయి స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ పోటీలలో దౌల్తాబాద్ ఆదర్శ పాఠశాల విద్యార్థిని విద్యార్థులు మంచి ప్రదర్శన కనబరిచి గెలుపొందారు. ఈ పోటీలలో అండర్ 14 బాలుర విభాగంలో వాలీబాల్ లో విజేతలుగా అండర్ 14 ఖో ఖో లో రన్నర్ అప్ , అండర్ 17 బాలుర విభాగంలో ఖో ఖో ,కబడ్డీ, వాలీబాల్ లో రన్నర్ ఆఫ్ గా అలాగే బాలికల విభాగంలో అండర్ 14 ఖో ఖో, కబడ్డీ, వాలీబాల్ లో విజేతలుగా అండర్ 17 ఖో ఖో లో విజేతలుగా గెలుపొందారాని పాఠశాల ప్రిన్సిపాల్ టిఎన్ యజ్ఞశ్రీ తెలిపారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రతి విద్యార్థి చదువుతోపాటు ఆటలలో రాణించాలని ఏ రంగంలోనైనా కష్టపడితే తప్పకుండా విజయం సాధిస్తారని విద్యార్థులు అందరూ గెలుపు ఓటములను సమానంగా తీసుకోవాలని తెలుపుతూ జిల్లా స్థాయి జిల్లా స్థాయిలో జరిగే పోటీలకు ఎంపికైన విద్యార్థులను అభినందిస్తూ రాష్ట్రస్థాయికి ఎంపికై పాఠశాలకు, మండలానికి మంచి పేరు తేవాలని కోరుతూ ఈ గెలుపు కారణమైన పాఠశాల పీడి సురేష్ ను అభినందించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు రాజేందర్, అల్తాఫ్ హుస్సేన్ మరియు ఉపాధ్యాయ బృందం పాల్గొన్నారు.