Thursday, 5 November 2026

మోది, కేసీఆర్ లది అన్నదమ్ముల బంధం రెండు నెలల్లో కేసీఆర్ ఖేల్ కతం తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రావడం ఖాయంకాంగ్రెస్ జాతీయ యువజన కాంగ్రెస్ అధ్యక్షులు బివి శ్రీనివాస్

వనపర్తి బ్యూరో సెప్టెంబర్19 (జనంసాక్షి)

కేంద్రంలో నరేంద్ర మోది, రాష్ట్రంలో కేసీఆర్ ది అన్నదమ్ముల బంధమని కేవలం ప్రజలను మభ్య పెట్టేందుకే ప్రత్యర్థి పాలనకు తెర లేపారే తప్ప మోదీ ఆదేశించడం కెసిఆర్ ఆమోదించడమే జరుగుతుందని కాంగ్రెస్ జాతీయ యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు బివి శ్రీనివాస్ అన్నారు.ఆదివారం తుక్కుగూడలో నిర్వహించిన కాంగ్రెస్ విజయభేరి భారీ బహిరంగ సభలో కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ ప్రవేశపెట్టిన ఆరు పథకాలను వనపర్తి నియోజకవర్గంలో లాంచ్ చేసేందుకు సోమవారం వచ్చిన ఆయనకు రాష్ట్ర యువజన కాంగ్రెస్ అధ్యక్షులు శివసేన రెడ్డి వనపర్తి నియోజకవర్గం కాంగ్రెస్ నాయకులు మేఘ రెడ్డి గారు పెద్దమందడి మండలం 44వ జాతీయ రహదారి బుర్రవాగు స్టేజి వద్ద స్వాగతం పలికారు._ ఆయనను శాలువాలతో సన్మానించారు అనంతరం అక్కడినుండి మోటార్ సైకిల్ ర్యాలీతో మోజెర్ల అల్వాల చిన్నమందడి ల మీదుగా ముందరి తండ గ్రామపంచాయతీకి చేరుకున్నారు
ముందుగా గ్రామంలో పర్యటించి గ్రామస్తుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు
గ్రామానికి వచ్చిన ఆయనకు గిరిజన మహిళలు సాంప్రదాయ దుస్తులతో మంగళహారతులతో _నుదుట తిలకం దిద్ది ఆహ్వానం పలికారు
ఈ సందర్భంగా ముందర తండాలో ఏర్పాటుచేసిన సమావేశంలో పాల్గొని ఆయన మాట్లాడారు తెలంగాణ రాష్ట్రంలో కెసిఆర్ కుటుంబం కెసిఆర్ మంత్రులు కేసీఆర్ ఎమ్మెల్యేలు కేసీఆర్ నాయకులు తప్ప ఏ ఒక్కరు కూడా బాగాలేరని ఇంకా రెండు నెలలు మాత్రమే వారి అరాచక, అవినీతి పాలన కొనసాగుతుందని రెండు నెలల తర్వాత రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వస్తుందన్నారు
దాంతో ప్రతి మారుమూల గ్రామంలోని నిరుపేదలకు సైతం ప్రభుత్వ పథకాల ఫలితం దక్కుతోందని ఆయన పేర్కొన్నారు ఎన్నికల ముందు ఎన్నో హామీలు ఇచ్చిన కేసీఆర్ అధికారం చేజిక్కాక హామీల ఊసే ఎత్తడం లేదని నేడు ఎన్నికల సమయంలో తాను అనేక పథకాలను ప్రజల ముందుకు తీసుకువస్తున్నాడని అలాంటి వాటిని ఎవరు కూడా నమ్మకూడదని ఆయన సూచించారు
కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే సోనియా గాంధీ ప్రవేశపెట్టిన ఆరు పథకాలు ప్రతి ఇంటికి చేరుతాయని గృహలక్ష్మి పథకం ద్వారా మహిళలకు నెలకు 2000 రూపాయలను వారి బ్యాంకు ఖాతాల్లో జమ చేస్తారని పేర్కొన్నారు.
రైతు భరోసా పథకం ద్వారా రైతులందరికీ ఎకరానికి 15 వేలు, వ్యవసాయ కూలీలకు 10 వేల రూపాయలను ఇస్తారని ఆయన తెలిపారు.
పండించిన పంటకు 500 రూపాయల మద్దతు ధర కల్పిస్తారని ఆయన పేర్కొన్నారు.
ఇల్లు లేని ప్రతి ఒక్కరికి ఇందిరమ్మ ఇల్లు నిర్మించుకునేందుకు ఐదు లక్షల రూపాయలను కాంగ్రెస్ ప్రభుత్వం అందజేయనుందని ఆయన పేర్కొన్నారు
మహిళలకు 500 రూపాయలకే సిలిండర్ల పంపిణీ,
రాష్ట్రవ్యాప్తంగా మహిళలు ఎక్కడ ప్రయాణం చేసిన ఆర్టీసీ బస్సులు ఉచిత ప్రయాణం
చదువుకునే మహిళ విద్యార్థులందరికీ స్కూటీల పంపిణీ ఉన్నత చదువులకు వెళ్లే విద్యార్థులకు 5 లక్షల రూపాయల ఏర్పాటు సౌకర్యం
నిరుపేద కుటుంబాల్లో అనారోగ్యంతో బాధపడే ప్రతి ఒక్కరికి ఆరోగ్య శ్రీ పరీక్షల కోసం పది లక్షల రూపాయలను ఖర్చు చేయనుందని ఆయన పేర్కొన్నారు.
రైతులకు ఏకకాలంలో రెండు లక్షల రూపాయల రుణమాఫీ_
200 యూనిట్ల వరకు ఉచిత కరెంటు
ఇవ్వనున్నట్లు ఆయన పేర్కొన్నారు.వనపర్తి నియోజకవర్గం లో ఉన్నటువంటి BRS నాయకుల చరిత్ర గూగుల్లో సెర్చ్ చేసిన వారి అక్రమ సంపాదనలు బయటపడుతున్నాయని ఆయన పేర్కొన్నారు
నిరుద్యోగులకు ఉద్యోగాల కల్పన ఇవ్వకుండానే నిరుద్యోగులందరూ హమాలీ పని చేసుకుని బతకాలి అన్న అహంకారపూరిత మాటలు మాట్లాడిన నాయకులు రెండు నెలల్లో తర్వాత వారు హమాలి పని చేసుకుని బతకాల్సిందేనని ఆయన విమర్శించారు
కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన ప్రతి పథకాన్ని ప్రజల్లోకి తీసుకువెళ్లి వారికి అర్థమయ్యే విధంగా వివరించాలని ప్రతి కాంగ్రెస్ కార్యకర్త ఒక సైనికుడిలా పని చేయాలని ఆయన సూచించారు.
అనంతరం గిరిజన మహిళలతో కలిసి ఆయన సహకరిది భోజనం చేశారు
కార్యక్రమంలో
స్థానిక సర్పంచ్ జయంతి చీకరు చెట్టు తండా సర్పంచ్ రాధాకృష్ణ పెద్దమందడి సర్పంచ్ వెంకటస్వామి అమ్మపల్లి
సర్పంచ్ రమేష్ యాదవ్ పెద్దమందడి మండల ఉపాధ్యక్షులు రఘు, ఎంపీటీసీ దామోదర్, ప్రసాద్ సింగిల్ విండో డైరెక్టర్ వెంకటేశ్వర్ రెడ్డి, సింగిల్ విండో మాజీ అధ్యక్షులు సత్య రెడ్డి మాజీ జెడ్పిటిసి రమేష్ గౌడ్, వనపర్తి పట్టణ కౌన్సిలర్లు రాధాకృష్ణ, బ్రహ్మంచారి, వెంకటేష్, మాజీ సర్పంచ్ సత్య శీలా రెడ్డి, మాజీ ఎంపిటిసి రామచంద్రయ్య గౌడ్, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు శ్రీనివాస్ గౌడ్, నాయకులు రంజిత్ కుమార్, లక్కాకుల సతీష్, నాయకులు కార్యకర్తలు కాంగ్రెస్ పార్టీ శ్రేణులు యువకులు మహిళలు పెద్ద ఎత్తున కార్యక్రమంలో పాల్గొన్నారు.