తెలంగాణపై ప్రధాని మోడీ మళ్ళీ విషం చిమ్మారు .
శాసనమండలి చైర్మన్ గుత్తా,ఎమ్మెల్యే భాస్కరరావు.
నల్గొండ బ్యూరో, జనం సాక్షి.
పార్లమెంటు సాక్షిగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ మళ్లీ తెలంగాణ రాష్ట్ర వ్యవహారంలో విషం చిమ్మారని తెలంగాణ శాసన మండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి అన్నారు. మంగళవారం నల్గొండ లోని తన క్యాంపు కార్యాలయం లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ
పార్లమెంట్ సాక్షిగా నిన్న ప్రధాన మంత్రి మోడీ పచ్చి అబద్ధాలు మాట్లాడుతూ తెలంగాణ పై విషం చిమ్మారన్నారు..
తెలంగాణ రాష్ట్ర సాధన కోసం రక్తం ఏరులై పారిందని మాట్లాడిన ప్రధాన మంత్రి ఎక్కడ రక్తం పారిందో చూపించాలి. గుజరాత్ లో రక్తఫుటేరులు పారిన సంఘటనలు ఇంకా మోడీ మరువనట్లు ఉందని అవే ఇప్పటికి మాట్లాడుతున్నాడని విమర్శించారు.వాజపేయి హయాంలో ఒక్క ఓటు రెండు రాష్ట్రాలు అని ప్రకటించి , జార్ఖండ్, చత్తీస్ ఘడ్ , ఉత్తరాఖండ్ రాష్ట్రాలను ఏర్పాటు చేసి ఆనాడు ఎందుకు తెలంగాణ ను ప్రత్యేక రాష్ట్రంగా ప్రకటించలేదని ప్రశ్నించారు.బీజేపీ చేసిన అన్యాయాలు అక్రమాలు అన్ని ఇన్ని కావు. ఆంధ్ర పాలకుల ఒత్తిళ్లకు లొంగి తెలంగాణ ఇవ్వలేదని, సీఎం కేసీఆర్ అలుపెరుగని పోరాట ఫలితంగానే కేంద్రం దిగి వచ్చి తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చిందన్నారు.ప్రజల ఒత్తిడి మేరకు తెలంగాణ ఏర్పాటు అయింది.మోడీ మనసు నిండా విషం ఉంది.మోడీ మాట్లాడే దాంట్లో అర్థం లేదు.
కాంగ్రెస్ పార్టీ ప్రజలను మభ్య పెట్టేలా హామీలు ఇస్తున్నదని,ఆ పార్టీ వాగ్దానాలు చేసిన 6 గ్యారంటీ హామీలు ఉత్తివే. ఆచరణకు సాధ్యం కాని హామీలను కాంగ్రెస్ పార్టీ ప్రకటిస్తుంది. ఆ పార్టీ అధికారంలో ఉన్న రాష్ట్రాలలో ఎందుకు అమలు చేయడం లేదని ప్రశ్నించారు. ఏది చేయాలన్నా ముఖ్యమంత్రి కేసీఆర్ వల్లనే సాధ్యం అవుతుందని .అది తెలంగాణ ప్రజలకు తెలుసన్నారు.
కాంగ్రెస్ చెప్పేవి అన్ని బోగస్. కాంగ్రెస్ హామీలు ఆచరణలో సాధ్యం కాదు.కాంగ్రెస్, బీజేపీ కల్లబొల్లి మాటలు నమ్మొద్దు కాంగ్రెస్ కు విజన్ లేదు.కేవలం అధికారం దాహమె ఉన్నది .
తెలంగాణ కోసం రాజీనామా చేయమంటే పారిపోయిన వ్యక్తి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి. యెండల లక్ష్మినారాయణ రాజీనామా చేస్తే కిషన్ రెడ్డి రాజీనామా చేయకుండా పారిపోయాడు. మత విద్వేషాలు రెచ్చగొట్టడం బీజేపీ పని.బీజేపీ పతనం ప్రారంభం అయింది. అందుకే మళ్ళీ మహిళ రిజర్వేషన్ బిల్లు అంటూ బీజేపీ హడావుడి చేస్తుంది.కుంభకోణలకు కేరాఫ్ అడ్రెస్ కాంగ్రెస్ పార్టీ. బోఫోర్స్ కుంభకోణంతో కాంగ్రెస్ పతనం అయిందన్నారు .
ఈ సమావేశంలో మిర్యాలగూడ ఎమ్మెల్యే భాస్కర్ రావు పాల్గొన్నారు.




