Thursday, 5 November 2026

బీజేపీ టికెట్ ధన్ పాల్ సూర్యనారాయణ…కే..?

యెండల ఆశలు ఆవీరి…… నిజామాబాద్ బ్యూరో,సెప్టెంబర్ 19(జనం సాక్షి): నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా ఎన్నికల వాతావరణం వేడెక్కింది. టికెట్ల కోసం నువ్వా నేనా అన్నట్లు ఒకరిపై ఒకరు పోటీ పడుతున్నారు .ఇప్పటికే బిఆర్ఎస్ టికెట్ బీగాల గణేష్ గుప్తకు ఖరారు చేసింది. ఇటు బిజెపిలో కాంగ్రెస్ పార్టీలో టికెట్ల కోసం ఆశావాహులు ఎదురుచూస్తున్నారు. కొన్ని రోజుల క్రితం బిజెపి ఆన్ అఫీషియల్ గా వెల్లడించిన లిస్టులో మాజీ ఎమ్మెల్యే యెండల లక్ష్మీనారాయణ పేరు ఉన్నప్పటికీ ప్రస్తుతం మంగళవారం వెల్లడించిన ఆన్ అఫీషియల్ లిస్ట్ లో ఆయన స్థలంలో ధన్పాల్ సూర్యనారాయణకు టికెట్ ఇచ్చేందుకు పార్టీ అధిష్టానం నిర్ణయించినట్లు సమాచారం. గత ఎన్నికల్లో ధన్పాల్ సూర్యనారాయణకు మాట ఇచ్చిన బిజెపి ప్రభుత్వం బిజెపి ప్రస్తుత అధ్యక్షుడు కిషన్ రెడ్డి నాడు బుజ్జగించి శివసేన నుంచి పోటీ చేసినప్పటికీ చివరి క్షణంలో సూర్యనారాయణకు కిషన్ రెడ్డి చోరువుతో విత్ డ్రా చేసుకున్నారు. అయినప్పటికీ 2019 ఎన్నికల్లో బిజెపికి అనుకున్నంత మెజారిటీ రాకపోగా ప్రస్తుతం ధన్ పాల్ సూర్యనారాయణ టికెట్ ఇచ్చేందుకు ఆలోచిస్తూ రాజకీయ రాజకీయ సమీకరణలు మరడంతో కొన్ని సర్వేల సేకరించిన సమాచారంతో యెండల లక్ష్మీనారాయణకు బదులు ధన్పాల్ సూర్యనారాయణకు టికెట్ ఇస్తే అర్బన్ లో గెలిచే అవకాశాలు ఉన్నాయని అధిష్టానం భావిస్తున్నట్లు తెలిసింది. 2024 రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో బిజెపి టికెట్టు ధన్పాల్ సూర్యనారాయణకి వచ్చే అవకాశాలు మెండుగా కనిపిస్తున్నాయి. గత కొంతకాలంగా టికెట్ కోసం ఎదురుచూసిన సీనియర్ బిజెపి నాయకులు మాజీ ఎమ్మెల్యే యెండల లక్ష్మీనారాయణ ఆశలు ఆవిరి అయ్యాయి. తెలంగాణ ఉద్యమ సమయంలో డి. శ్రీనివాస్ పై రెండు సార్లు గెలిచిన లక్ష్మీనారాయణకు గతంలో మంచి ఆదరణ ఉండేది. రానురాను నగరంలో క్యాడర్ తగ్గిపోవడంతో పార్లమెంటు ఎన్నికల్లో పూర్తిస్థాయి పని చేయలేదని అధిష్టానం భావించినట్లు సమాచారం. 2019 ఎన్నికల్లో యెండలకు బిజెపి టికెట్ ఇచ్చినప్పటికీ అర్బన్ ప్రజలు యెండలపై అంతగా ఆసక్తి చూపలేకపోయారు. పార్లమెంటు ఎన్నికల్లో యువత బిజెపి వైపు మొగ్గుచూపుటంలో అర్బన్ లో ధన్పాల్ సూర్యనారాయణ క్రియ శీలక పాత్ర పోషించారు. అంతేకాకుండా ధన్పాల్ సూర్యనారాయణ చేసే సామాజిక సేవా కార్యక్రమాలు బిజెపికి కలిసి వచ్చే అంశముగా తీసుకున్నట్లు తెలిసింది. యువతకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటూ అందరితో మమేకమై చిన్న పెద్ద అనే తారతమ్యాము లేకుండా అనుక్షణం అందరికీ అందుబాటులో ఉండడం ధన్పాల్ కు కలిసి వచ్చే అంశం. అలాగే పేద ప్రజలకు కష్టం వస్తే సేవ చేయడానికి ధన్పాల్ సూర్యనారాయణ ముందు వరుసలో ఉంటారు అన్నది అర్బన్ ప్రజల నమ్మకం. అంతేకాకుండా తన ట్రస్టు ద్వారా ఎంతో మందికి సేవ చేయడం నగరంలో సేవ కార్యక్రమాలు చేస్తూ అన్ని కార్యక్రమాల్లో పాల్గొంటూ అనుక్షణం అన్ని వర్గాలతో సంబంధాలు పెంచుకొని అర్బన్ ప్రజల మన్నానలను పొందారు. ఇక వినాయక చవితి , దసరా సందర్భంగా యువతకు సేవలందిస్తూ ఉంటారు. ఇది ధన్ పాల్ కు మరింత కలిసి వచ్చే అంశంగా అధిష్టానం భావించినట్లు తెలిసింది. నగరంలో ఎవ్వరి మనసును నొప్పించకుండా ఉండడం సూర్యనారాయణ నైజం. అందుకే అర్బన్ ప్రజలు రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో ధన్పాల్ సూర్యనారాయణ వైపు మొగ్గు చూపేందుకు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.