Thursday, 5 November 2026

ప్రత్యేక పార్లమెంటు సమావేశంలోనే ఎస్సీ వర్గీకరణ కు చట్టబద్ధత కల్పించాలి

అల్వాల్ రాజు. ఎమ్మార్పీఎస్ జిల్లా కార్యదర్శి

బచ్చన్నపేట( జనం సాక్షి) సెప్టెంబర్ 19
ఎస్సి వర్గీకరణ అత్యవసర పార్లమెంట్ సమావేశాలలో ప్రవేశ పెట్టాలని డిమాండ్ చేస్తూ బచ్చన్నపేట మండల కేంద్రంలో ఎమ్మార్పీఎస్ కో ఇన్చార్జి కర్రే శ్రీనివాస్ ఆధ్వర్యంలో ఎం ఎస్ పి . ఎమ్మార్పీఎస్ సంఘాల తరఫున చేస్తున్నటువంటి సమ్మెకు ముఖ్య అతిథులుగా. జనగామ
జిల్లా కార్యదర్శి అల్వాల్ రాజు కాంగ్రెస్ సీనియర్ నాయకులు ఈదులకంటి వెంకటరెడ్డి ఎమ్మార్పీఎస్ సీనియర్ నాయకులు అల్వల నర్సింగరావు హాజరై మాట్లాడుతూ.
కేంద్ర ప్రభుత్వం అత్యవసరంగా జరుపుతున్న 5 రోజుల ప్రత్యేక పార్లమెంట్ సమావేశాలలో ఎస్సీ వర్గీకరణ బిల్లు పెట్టి చట్టబద్దతకల్పించి ప్రధాన ఎజెండాగా ఉండేలా చూడాలని డిమాండ్ చేశారు.
ఎస్సీ వర్గీకరణకు అనుకూలంగా అందరూ ఉన్నప్పటికీ కేవలం బిజెపి చిత్తశుద్ధి చూపకపోవడం వల్లే ఆలస్యం అవుతుందని అన్నారు. సాక్షాతూ ప్రధానమంత్రి హామీ ఇచ్చిన ఇప్పటికీ వర్గీకరణ జరగకపోవడం బిజెపి నిర్లక్ష్యానికి నిదర్శనమని అన్నారు.
దేశంలో ఎవరు అడగని సమస్యలను పరిష్కారం చేస్తున్న బిజెపి మాదిగలు 30 ఏళ్లుగా కోరుతున్న ఎస్సీ వర్గీకరణను ఎందుకు పరిష్కారం చేయటం లేదని ప్రశ్నించారు.వర్గీకరణ చేయకపోతే దక్షిణ భారతదేశ వ్యాప్తంగా బిజెపి రాజకీయంగా భూస్థాపితం అవుతుందని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో పాకాల కుమారస్వామి మాదిగ నల్ల అంజయ్య మాదిగ గంధ మల్ల మల్లేష్ మాదిగ వడ్డేపల్లి యాకం రెడ్డి పైసా సిద్ధులు బీసీ నాయకులు కుక్కుడాల పుల్లయ్య ఆరా బాలయ్య శ్రీకాంత్ రాగి చెట్టు శ్రీను తదితరులు పాల్గొన్నారు