ఉత్తమ ఉపాధ్యాయురాలు కరుణ కుమారికి ఘన సన్మానం
వరంగల్ ఈస్ట్, సెప్టెంబర్ 19 (జనం సాక్షి)
కరీమాబాద్ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో పాఠశాల క్రాఫ్ట్ ఉపాధ్యాయుని అకినపేల్లి కరుణకుమారి కి జిల్లాఉత్తమఉపాధ్యాయురాలిగా అవార్డు వచ్చినందుకు పాఠశాల ఉపాధ్యాయ బృందం ఏర్పాటుచేసిన ఆత్మీయ అభినందన సమావేశానికి పాఠశాల హెడ్మాస్టర్ డాక్టర్ దుర్గం రవి అధ్యక్షత వహించారు. ఈ సమావేశానికి ముఖ్యఅతిథిగా వచ్చిన ఎస్ ఎం సి ఛైర్మెన్ ఇనాయత్ అత్తర్ మాట్లాడుతూ సమయ పాలన పాటిస్తూ నిబద్ధతతో పనిచేస్తే ప్రభుత్వం గుర్తింపు లభిస్తుందని గతంలో కరుణ టీచర్ విద్యార్థులు 2016-17 విద్యా సంవత్సరంలో క్రాఫ్ట్ లో జాతీయస్థాయిలో ప్రథమ బహుమతి గెలిచి ప్రభుత్వం చే నగదు పురస్కారాన్ని పొందారని అలాగే 2022-23 సంవత్సరంలో రాష్ట్రస్థాయిలో రెండవ బహుమతి పొందినారని ఇవి టీచర్ వృత్తి నిబద్ధతకు ప్రభుత్వం నుండి వచ్చిన ప్రోత్సాహం ఈ జిల్లా స్థాయి ఉత్తమ ఉపాధ్యాయనీ గా గుర్తింపు అని అన్నారు. పాఠశాల ప్రధానోపాధ్యాయులు మాట్లాడుతూ కరుణ వృత్తి పట్ల అంకిత భావం క్రమశిక్షణ గల వార ని కొనియాడారు. పాఠశాల స్టాఫ్ సెక్రటరీ శోభారాణి విద్యార్థులతో కరుణ స్నేహంగా ప్రేమతో ఉంటారని కొనియాడారు. ప్రాథమిక పాఠశాల హెడ్మాస్టర్ డి . శ్రీకాంత్ మాట్లాడుతూ కరుణ టీచర్ అందరితో ముఖ్యంగా విద్యార్థులతో స్నేహంగా ఉంటారని అన్నారు. వివిధ కళాత్మక రంగాలలో విద్యార్థులను ప్రోత్సహిస్తున్నట్లు తెలిపారు. ఉత్తమ ఉపాధ్యాయురాలు అవార్డు రావడం ఎంతో అభినందనీయం అన్నారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయ బృందం విద్యార్థులు టీచర్ని ఘనంగా అభినందిస్తూ సన్మానించారు. ఈ సన్మాన గ్రహీత కరుణ మాట్లాడుతూ ఈ గుర్తింపు సన్మానం మరువలేనని వృత్తిలో నాకు ఇంకా ప్రోత్సాహంగా పనిచేయడానికి దోహదపడుతుందని నాపై బాధ్యత మరింత పెరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయ బృందం విద్యార్థులు పాల్గొన్నారు.




