Thursday, 5 November 2026

అంగన్వాడీల సమ్మెపై రౌండ్ టేబుల్ సమావేశం
* డిమాండ్లను సాధించేవరకు జాయింట్ యాక్షన్ కమిటీ మద్దతు

టేకులపల్లి, సెప్టెంబర్ 19 (జనం సాక్షి ): అంగన్వాడీ ఉద్యోగులు నిరవధికంగా నిర్వహిస్తున్న సమ్మె మంగళవారానికి 9వ రోజుకు చేరింది. టేకులపల్లి మండల తహసిల్దార్ కార్యాలయం ఎదుట సమ్మెలో భాగంగా రౌండ్ టేబుల్ సమావేశం ఏఐటీయూసీ, సిఐటియు జాయింట్ యాక్షన్ కమిటీ వారి ఆధ్వర్యంలో జరిగింది.ఈరౌండ్ టేబుల్స మావేశానికి అధ్యక్ష వర్గంగా ఏఐటియుసి నాయకురాలు వై ఇందిరా, సిఐటియు శకుంతల అధ్యక్షతన జరిగింది. ఈ కార్యక్రమంలో వివిధ రాజకీయ పార్టీలకు చెందిన జిల్లా నాయకులు, మండల నాయకులు పాల్గొని మాట్లాడుతూ ఈ నిరవధిక సమ్మె మీ నాయమైన డిమాండ్ల పరిష్కారానికి మీరందరూ ఐక్యంగా ఉండి సాధించాలని సూచించారు. అంగన్వాడి ఉద్యోగాలను పర్మినెంట్ చేయాలని, కనీస వేతనం 26 వేల రూపాయలు ఇవ్వాలని,గ్రాడ్యుటి అమలు చేయాలని, రిటైర్మెంట్ బెనిఫిట్ పెన్షన్ పెంపు ఇతర సమస్యలు పరిష్కరించాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి హెచ్చరించారు. తెలంగాణ అంగన్వాడి టీచర్స్ అండ్ హెల్పర్స్ జాయింట్ యాక్షన్ కమిటీ ఏర్పడి దేశంలో ఐసిడిఎస్ ప్రారంభించి 48 సంవత్సరాలు అవుతుందని అన్నారు.రానున్న రెండు సంవత్సరాల కాలంలో అర్థ శతాబ్ది ఉత్సవాలు జరుపుకోబోతున్నాము, కానీ రాష్ట్ర ప్రభుత్వం తమ పరిధిలో ఉన్న సమస్యలను పరిష్కారం చేయడం లేదు పైగా రాష్ట్రంలో ఎన్నికలు నిర్వహించడానికి సిద్ధమవుతుంది ఇప్పటికే రాష్ట్రంలో 115 మంది తమ అభ్యర్థులను కూడా టిఆర్ఎస్ ప్రభుత్వం ప్రకటించింది, కానీ అనేక సంవత్సరాల నుండి 1000 కళ్ళతో ఎదురుచూస్తున్న అంగన్వాడీ ఉద్యోగాల సమస్యలు మాత్రం రాష్ట్ర ప్రభుత్వం నేటికీ పరిష్కారం చేయలేదు వారి యొక్క న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఇతర సంఘాలు కూడా నిరవధిక సమ్మెక