Thursday, 5 November 2026

మహిళా రిజర్వేషన్ బిల్లును స్వాగతిస్తున్నాం. బిఆర్ఎస్ పార్టీ ఒత్తిడి, పోరాట ఫలితమే మహిళా రిజర్వేషన్ బిల్లు.
మహిళా బిల్లు ఆమోదం సంతోషం.
చట్టసభలలో మహిళా శక్తి.

మున్సిపల్ వైస్-చైర్ పర్సన్ పట్లోళ్ల దీప నర్సింలు.
తాండూరు సెప్టెంబర్ 19(జనంసాక్షి)పార్లమెంటు మరియు శాసనసభల్లో 33శాతం మహిళా రిజర్వేషన్ కు ఆమోదం తెలిపిన కేంద్ర క్యాబినెట్ ను స్వాగతిస్తున్నామని, చట్టసభల్లో మహిళలకు ప్రాతినిధ్యం కల్పించినప్పుడే మహిళా సాధికారత సాధ్యమవుతుందని, బిఆర్ఎస్ పార్టీ ఒత్తిడి, పోరాట ఫలితమే మహిళా రిజర్వేషన్ బిల్లుతో రాజకియంగా మహిళలకు గుర్తింపు దొరుకుంతుందని మున్సిపల్ వైస్-చైర్ పర్సన్ పట్లోళ్ల దీప నర్సింలు అన్నారు.ఎదగాలని ప్రయత్నం చేస్తున్న మహిళలకు మంచి అవకాశం అని చెప్పొచ్చు..మా కవితక్క అనుకున్నది సాధించిందని ఆమె సంతోషం వ్యక్తం చేశారు.
ఎటోచ్చి పేరు భార్యలది పెత్తనం భర్తలది అనే దగ్గరే సమస్య ఉండేదని..మహిళా సాధికారత దిశగా ఈ ‘మహిళా రిజర్వేషన్ బిల్లు’ ఒక వరంగా మారనుందని.ఈ సందర్భంగా ఆమె మహిళా నాయకురాల్లందరికి శుభాకాంక్షలు తెలియజేసారు.మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు కల్పించాలని ఎంతో పోరాటం చేసిన కవితక్కకు ఆమె కృతజ్ఞతలు తెలిపారు.తండ్రి కేసీఆర్ నేర్పిన పోరుబాటలో అడుగులు వేసిన కవితక్క, తండ్రి తెలంగాణ సాధించి ప్రజల గుండెల్లో నిలిస్తే, కూతురు కవితక్క మహిళా రిజర్వేషన్ కై గల్లీ నుండి ఢిల్లీ దాకా పోరాటం చేసి ఈరోజు మహిళా రిజర్వేషన్ బిల్లు సాధించి యావత్ భారత మహిళల గుండెల్లో చిరస్థాయిగా నిలిచరని దీప నర్సింలు పేర్కొన్నారు.