Thursday, 5 November 2026

కాంగ్రెస్ పార్టీ సీరోల్ మండల ఎస్టీసెల్ అధ్యక్షుడిగా తేజావత్ జైల్ సింగ్ నాయక్

టీపీసీసీ ఆదివాసి గిరిజన వైస్ చైర్మన్, డోర్నకల్ కాంగ్రెస్ ముఖ్య నేత చేతులమీదుగా నియామకపత్రం అందుకున్న తేజావత్ జైల్ సింగ్ నాయక్

డోర్నకల్ /సీరోల్, సెప్టెంబర్ 19, జనం సాక్షి న్యూస్: మహబూబాబాద్ జిల్లా
సీరోల్ మండల కాంగ్రెస్ పార్టీ ఎస్టీ సెల్ అధ్యక్షుడిగా ఎన్నకైన తేజవత్ జైల్ సింగ్. డోర్నకల్ నియోజకవర్గం సీరోల్ మండలం రేకుల తండా గ్రామానికి చెందిన కరుడు కట్టిన కాంగ్రెస్ వాధి, మండల నాయకులు తేజవత్ జైల్ సింగ్ నాయక్ ను మండల ఎస్టీ సెల్ అధ్యక్షులుగా నియమిస్తున్నట్లు టీపీసీసి ఆదివాసీ గిరిజన వైస్ చైర్మన్,డోర్నకల్ నియోజకవర్గ కాంగ్రెస్ నాయకులు మాలోతు నెహ్రూ నాయక్ కి అధికార పత్రాన్ని అందజేశారు. జైల్ సింగ్ మాట్లాడుతూ నా ఎన్నికకు సహాయపడిన నియోజకవర్గ ముద్దు బిడ్డ మాలోతూ నెహ్రూ నాయక్ కి,జిల్లా వైస్ చైర్మన్ గుగులోతూ లాలు నాయక్,మాజీ కేంద్ర మంత్రి బలరాం నాయక్,అల్ ఇండియా ఆదివాసీ నాయకులు తేజవత్ బెల్లయా నాయక్,జిల్లా అధ్యక్షులు భరత్ బాబు,జిల్లా నాయకులు వెన్నం శ్రీకాంత్ రెడ్డి,కొండపల్లి రఘురాం రెడ్డి,మండల బాధ్యులు బద్రు నాయక్,మండల చేరికల కమిటీ చైర్మన్ బానోతు రాందాస్ నాయక్,మండల నాయకులు రంగన్న గౌడ్,అడిగే రాజు,ప్రభాకర్ రెడ్డి,బిక్కు లాల్,భూక్యా బిచ్చ సాధు,తేజు నాయక్,విజయ్,శివ నాయక్ , గుగులోతు నారాయణ,హము నాయక్, హాట్యా తండా ఉప సర్పంచ్ బాలాజీ నాయక్,వార్డు మెంబర్లు మా రమేష్,నగేష్,నియోజకవర్గ సోషల్ మీడియా కో ఆర్డినేటర్ మోహన్ నాయక్ కి ధన్యవాదాలు తెలియజేస్తూ కాంగ్రెస్ పార్టీ గెలుపుకోసం నిరంతరం పనిచేస్తూ,మండలం లో మెజారిటీ వచ్చే విధంగా పనిచేస్తానని తెలిపారు. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియాగాంధీ, రాహుల్ గాంధీ, టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఆశీస్సులతో కాంగ్రెస్ రైతు డిక్లరేషన్, గ్యారెంటీ కార్డు పథకాలతో రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుందని డోర్నకల్ నియోజకవర్గంలో మాలోత్ నెహ్రూ నాయక్ ఆద్వర్యంలో డోర్నకల్ గడ్డపై కాంగ్రెస్ పార్టీ జెండా ఎగురవేయడం ఖాయమని కాంగ్రెస్ పార్టీ ఎస్టీ సెల్ సీరోల్ మండల అధ్యక్షుడు తేజావత్ జైల్ సింగ్ నాయక్ భీమా వ్యక్తం చేశారు.