Thursday, 5 November 2026

సాధ్యం కాని హామీలతో ప్రజలను మోసం చేస్తున్న కాంగ్రెస్ పార్టీ
— బిఆర్ఎస్ నాయకులు మర్రి అనిల్ కు

మోత్కూరు సెప్టెంబర్ 19 జనం సాక్షి : సాధ్యం కాని హామీలతో ప్రజలను మోసం కాంగ్రెస్ పార్టీ మోసం చేస్తుందని బిఆర్ఎస్ నాయకులు మర్రి అనిల్ కుమార్ అన్నారు. మంగళ వారం విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ జాతీయ స్థాయి పార్టీ కి జాతీయ విధానమే ఉంటుంది కానీ ఓట్ల కోసం ఇంత దిగజారి కేవలం ఒక తెలంగాణ లోనే మనిపెస్టో ను విడుదల చేసింది. ఈ మానిఫెస్తో దేశానికి వర్తిస్తదా లేక ఒక తెలంగాణకేనా ,అసలు అమలు కానీ హామీలు ఇచ్చి తెలంగాణ ప్రజలను మోసం చేయాలని చూస్తే తెలంగాణ చైతన్యం గల ప్రాంతం అంత అలవోకగా మోసపోరు . మోసం చేయాలనుకునేవారు తాట తీసే ప్రాంతం .ఒక పార్టీకి ఒక రాష్ట్రం లో ఒక విధానం వేరే రాష్ట్రం లో ఇంకొక విధానం ఉంటుందా . అసలు ఈ అసాధ్యమైన హామీలను అమలు చేయడానికి ఎంత బడ్జెట్ అవుతుందో తెలుసా. నరం లేని నాలక ఎట్లనన్న మాట్లాడుతుంది. వారు చెప్పే పథకాలు వారికే స్పష్టత లేదు . పక్క రాష్ట్రం అయిన కర్ణాటక లో ఇట్లనే తాహతుకు మించి హామీలు ఇచ్చి అమలు చేయలేక చేతులెతేసింది అక్కడి కాంగ్రెస్ ప్రభుత్వం. రాజస్థాన్ లో కరెంటు కోసం ప్రతి రోజు ఉద్యమాలు చేస్తున్నారు అక్కడి ప్రజలు. అన్ని రాష్ట్రాలు వేరు తెలంగాణ ప్రజల ఆలోచన విధానం వేరు ఇలాంటి జూట మాటలు తిప్పికొట్టి మరోసారి బిఆర్ఎస్ ప్రభుత్వానికే పట్టం కట్టబోతున్నారని మర్రి అనిల్ కుమార్ అన్నారు. ఈ కార్యక్రమం లో నల్ల ప్రభాకర్,బోడ శ్రీను,డా.రఘువర్ధన్ రావు , గుంటి దేవ, కుసంపల్లి నర్సింహా,మండల సోమయ్య , గుంటి ఆనందం తదితరులు పాల్గొన్నారు