ముదిరాజ్ సంఘం అధ్యక్షులు శంకర్ కు ఘన సన్మానం
జహీరాబాద్ సెప్టెంబర్ 19 (జనం సాక్షి) ;ముదిరాజ్ సంఘం జహీరాబాద్ తాలూకా అధ్యక్షులు గా ఎన్నికైన పెద్దదొడ్డి శంకర్ ముదిరాజ్ ను ఎల్పింగ్ హ్యాండ్స్ ఫౌండేషన్ సంస్థ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. మంగళవారం సంస్థ చైర్మన్ మొరంగిపల్లి జైపాల్, శంకర్ ముదిరాజ్ కు అతిథి హోటల్ శాలువా పూలమాల తో ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా జైపాల్ మాట్లాడుతూ శంకర్ ముదిరాజ్ ఇంకెన్నోఅత్యున్నత పదవులు పొందాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో కె ఎం ఆర్ యువ సేన జహీరాబాద్ కన్వీనర్ చింతల్ గట్టు శివరాజ్, పెన్ గన్ ఎడిటర్ రాయికోటి నర్సిములు బి ఆర్ ఎస్ నాయకులు గినియర్ పల్లి నర్సిములు నాయకులు రాజు, ముదిరాజ్ సంఘం నాయకులు మనయ్యా ముదిరాజ్ తదితరులు పాల్గొన్నారు.




