Thursday, 5 November 2026

గౌరవంగా అంతిమ సంస్కారాలు నిర్వహించుకోవడానికి పల్లెల్లో, పట్టణాల్లో వైకుంఠధామాల ఏర్పాటు: వికారాబాద్ ఎమ్మెల్యే “డాక్టర్ మెతుకు ఆనంద్”

వికారాబాద్ రూరల్ సెప్టెంబర్ 19 జనం సాక్షి
గౌరవంగా అంతిమ సహస్రాలు నిర్వహించుకోవడానికి పల్లెల్లో పట్టణాల్లో వైకుంఠ దామాలు ఏర్పాటు చేసిన ఘనత ముఖ్యమంత్రి కేసీఆర్ కే దక్కిందని వికారాబాద్ జిల్లా బి ఆర్ ఎస్ పార్టీ అధ్యక్షులు, ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్ పేర్కొన్నారు మంగళవారం వికారాబాద్ మున్సిపాలిటీ పరిధిలోని గంగారం సమీపంలో వైకుంఠధామం ప్రారంభోత్సవం కార్యక్రమంలో పాల్గొన్నారు.1 కోటి 10 లక్షల నిధులతో* సౌకర్యవంతంగా వైకుంఠధామాన్ని ఏర్పాటు చేయడం జరిగిందన్నారమరణించిన తర్వాత గౌరవప్రదంగా అంతిమ సంస్కారాలు జరగాలనే ఉద్దేశంతో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పట్టణాలలో మరియు పల్లెల్లో ఎలాంటి విభేదాలు లేకుండా అంతిమ సంస్కారాలు నిర్వహించుకోవడానికి వైకుంఠధామాలను ఏర్పాటు చేయడం జరిగిందన్నారు.
ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్ పర్సన్ మంజుల రమేష్ కుమార్ మున్సిపాల్ కౌన్సిలర్ లు అనంతరెడ్డి సురేష్ గోపాల్ ముదిరాజ్ మంజుల కడియాల వేణుగోపాల్ బిఎసిఎస్ చైర్మన్ ముత్యంరెడ్డి పిఎసిఎస్ వైస్ చైర్మన్ పాండు పట్టణ బి ఆర్ఎస్ అధ్యక్షుడు ప్రభాకర్ రెడ్డి లక్ష్మీకాంత్ రెడ్డి మండల పార్టీ అధ్యక్షుడు కుమార్ రెడ్డి ప్రజాప్రతినిధులు, అధికారులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. ప్రజాప్రతినిధులు, అధికారులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.