దహణసంస్కారాలకు ఆపన్న హస్తం అందించిన మేఘారెడ్డి
వనపర్తి బ్యూరో సెప్టెంబర్19( జనంసాక్షి)
పెద్దమందడి మండల పరిధిలోని జగత్ పల్లి గ్రామానికి చెందిన స్వామి కుమారుడు పి రవి అనారోగ్యంతో మరణించగ దహణసంస్కారాల నిమిత్తం వనపర్తి నియోజకవర్గ కాంగ్రెస్
నాయకులు తూడి మేఘా రెడ్డి
దృష్టికి తీసుకువెల్లగా మానవతా దృక్పథంతో స్పందించిన నేత దహణసంస్కారాల నిమిత్తం
మేఘన్న భరోసా పథకం క్రింద
ఐదు వేలు ఆర్థిక సహాయం చేశారు.
ఇట్టి సహాయాన్ని గ్రామ కాంగ్రెస్ నాయకులు మృతుని ఇంటికి వెళ్లి వారి కుటుంబ సభ్యులకు అందచేశారు.ఈ కార్యక్రమంలో గట్టు యాదవ్ కాంగ్రెస్ సీనియర్ నాయకులు బీచ్పల్లి చంద్రయ్య రాఘవేందర్ మన్యంకొండ చెన్నయ్య గుమ్మడం చంద్రయ్య టి బుచ్చన్న హుస్సేనయ్య తదితరులు పాల్గొన్నారు.




