Thursday, 5 November 2026

ఎమ్మెల్సీ కవిత ను కలిసిన జెడ్పీ చైర్మన్‌

జనంసాక్షి, మంథని : భారత జాగృతి అధ్యక్షురాలు,మాజీ ఎంపీ, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ను పెద్దపల్లి జిల్లా పరిషత్‌ చైర్మన్‌, బీఆర్‌ఎస్‌పార్టీ మంథని ఎమ్మెల్యే అభ్యర్థి పుట్ట మధూకర్‌ మర్యాద పూర్వకంగా కలిశారు. హైదరాబాద్‌లో మర్యాద పూర్వకంగా కలిసి కృతజ్ఞతలు తెలిపారు. పార్లమెంట్‌లో మహిళా బిల్లును ప్రవేశపెట్టడంలో కీలకపాత్ర పోషించడం పట్ల ఆయన హర్షం వ్యక్తం చేస్తూ ఎమ్మెల్సీ కవితకి శుభాకాంక్షలు తెలిపారు.