Thursday, 5 November 2026

అంగన్ వాడి ఉద్యోగులను పర్మినెంట్ చేయాలి
– మంథని ఎమ్మెల్యే శ్రీధర్ బాబు డిమాండ్

జనంసాక్షి, మంథని : పెద్దపల్లి జిల్లా మంథని పట్టణంలో అంగన్వాడీ ఉద్యోగులు గత కొద్ది రోజులుగా చేస్తున్న నిరవధిక సమ్మె కు కాంగ్రెస్ పార్టీ ఎసిసి సెక్రటరీ, మంథని ఎమ్మెల్యే దుద్దుల్ల శ్రీధర్ బాబు మద్దత్తు తెలిపారు. తమ సమస్యల పరిష్కారం కొరకు రాష్ట్ర ప్రభుత్వం తో పోరాడాలని అంగన్వాడి టీచర్లు శ్రీధర్ బాబును కోరారు. అనంతరం శ్రీధర్ బాబు మాట్లాడుతూ… అంగన్వాడి ఉద్యోగులను పర్మినెంట్ చేయాలి, కనీస వేతనం 26 వేలు చెల్లించాలని, రిటైర్మెంట్ బెనిఫిట్స్, పెన్షన్ పెంపు ఇతర సమస్యలను వెంటనే పరిష్కరించాలని, 60 సంవత్సరాల తర్వాత అంగన్వాడి ఉద్యోగులు వాలంటరీ రిటైర్మెంట్ కోరితే 5 లక్షల రూపాయలతో పాటు వేతనంలో సగం పెన్షన్ ఇవ్వాలని, ప్రమాద బీమా కల్పించాలని, అంగన్వాడి కుటుంబాలకు ఆసరా, కల్యాణ లక్ష్మి తదితర ప్రభుత్వ సంక్షేమ పథకాలు అన్నిటిని అమలు చేయాలి, ఇచ్చిన హామీలన్నీ వెంటనే అమలు చేసి వీరికి తగిన న్యాయం చేయాలి, లేదంటే కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో అంగన్వాడీల పక్షాన పోరాటం ఉదృతం చేస్తామని హెచ్చరించారు.