క్రేన్ సమకూర్చాలని ఆర్డిఓ ఆర్ జి 3 జిఎం లకు వినతి
జనంసాక్షి , కమాన్ పూర్ : పెద్దపల్లి జిల్లా కమాన్ పూర్ మండలంలోని గుండారం గ్రామంలో గల రిజర్వాయర్‌లో గణేష్ నిమజ్జనానికి సింగరేణి సంస్థచే క్రేన్ ఇప్పించాలని కోరుతూ గుండారం సర్పంచ్ ఆకుల ఓదెలు, ఉపసర్పంచ్ రాచకొండ చంద్రమౌళి నాయకులు రాచకొండ రవి, మల్యాల భాస్కర్, సీనియర్ జర్నలిస్ట్ జబ్బార్ ఖాన్ లు మంథని ఆర్డీవో హనుమాన్ నాయక్ , ఆర్ జి 3 జిఎం సుధాకర్ రావు లకు వినతిపత్రం సమర్పించారు. కాగా చాలా గ్రామాల నుండి గణేషులను నిమజ్జనానికి తీసుక రావడం జరుగుతుందని కావున 40 టన్నుల క్రేన్ ఇవ్వాలని వారు కోరారు. దానికి అధికారులు సానుకూలంగా స్పందించారు. గత కొన్ని సంవత్సరాలుగా సింగరేణి సంస్థ గుండారం రిజర్వాయర్ కు క్రేన్‌ను సమకూరుస్తోంది. అలాగే ఏర్పాట్లను గుండారం గ్రామపంచాయతీ ఆధ్వర్యంలో చేయనున్నారు. గత సంవత్సరాన్ని పోలిస్తే ఈసారి అధిక సంఖ్యలో గుండారం రిజర్వాయర్ కు గణేషుడు లు నిమజ్జనానికి రానున్నాయి.




