చంద్రబాబు ని బేషరతుగా విడుదల చేయాలని మౌనదీక్ష.
తెదేపా నాయకులు నందిమల్ల.అశోక్,వెంకటయ్య యాదవ్
వనపర్తి బ్యూరో సెప్టెంబర్19( జనంసాక్షి)
జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఎన్. టి.ఆర్ విగ్రహం ముందు అభిమానులు మౌనదీక్ష చేశారు.ఈ దీక్ష కు నందిమల్ల.అశోక్,వెంకటయ్య యాదవ్,సయ్యద్.జమీల్ మద్దతు ప్రకటించారు. అనంతరం వారు మాట్లాడుతూ గతములో అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న నాయకులు జైల్లో ఉంటే వరసగా అవినీతి బయటపడేది నేడు అక్రమంగా అరెస్ట్ అయిన చంద్రబాబు విషయములో ఆయన చేసిన అభివృద్ధి బయటకు వస్తుందని, బాబు అరెస్ట్ పట్ల ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగువారు స్పందించి ఎందరికో తన విజన్ ద్వారా జీవనోపాధి కలిపించిన చంద్రబాబును విడుదల చేయాలని కోరుతున్నారంటే అది చంద్రబాబు సత్తా అని తెలిపారు.ఎప్పటికైనా సైకో జగన్మోహన్ రెడ్డి ప్రజలకు క్షేమాపణ చెప్పి చంద్రబాబును విడుదల చేయాలని డిమాండ్ చేశారు.టి.ఆర్.ఎస్ స్పందించాలి. చంద్రబాబు చేసిన అభివృద్ధి ఫలాలు అనుభవిస్తున్న కె.సి.ఆర్ అక్రమంగా చంద్రబాబు అరెస్టును ఖండించకపోవడాని తీవ్రంగా ఖండించారు.
ఈ కార్యక్రమంలో ఎన్టీఆర్ ఫ్యాన్స్ అసోసియేషన్ సభ్యులు యం.డి.గౌస్, బాలకృష్ణ అభిమానులు హోటల్ బలరాం, దస్తగిర్ నాయుడు, నందిమల్ల రమేష్ ,డి.బాలరాజు, మహ్మద్ దస్తగిర్ , కొత్త.గొల్ల.శంకర్,అనిల్,బాలయ్య,ఆటో.వెంకరేశ్,శ్రీరామ్,నందిమల్ల.సాంబయ్య,దేవేందర్,కృష్ణమూర్తి,విశ్వనాథం
పాల్గొన్నారు.




