విద్యార్థులకు జీవన నైపుణ్యాలను నేర్పించండి
జిసిడివో ఉమారాణి
రాజంపేట్ సెప్టెంబర్ 19 జనం సాక్షి
రాజంపేట్ కస్తూర్బా గాంధీ విద్యాలయలో జరుగుతున్న జీవన నైపుణ్యాల శిక్షణా కార్యక్రమానికి హాజరైన జిల్లా జిసిడివో ఉమారాణి మాట్లాడుతూ కస్తూర్బా గాంధీ బాలిక విద్యాలయాల్లో చదువుతున్న విద్యార్థినులకు జీవన నైపుణ్యాలను నేర్పించాలని తెలియజేశారు. కౌమారదశలో వస్తున్న శారీరక మానసిక మార్పుల గురించి విద్యార్థులకు అవగాహన కల్పించి వారి లోపల ఉన్న భావోద్వేగాలను నియంత్రణలో ఉంచేదానికి ఉపాధ్యాయులు అందరూ కృషి చేయాలని తద్వారా విద్యార్థులు స్వేచ్ఛగా సంతోషంగా హాయిగా నాణ్యమైన విద్యను పొందుటకు సరైన వాతావరణాన్ని వారికి అందుబాటులో ఉంచవలెనని తెలిపినారు. రెసిడెన్షియల్ పద్ధతిలో తరగతుల నిర్వహణ ఉంటుంది కావున విద్యార్థులకు అకాడమిక్ పరంగా మంచి నాణ్యత తో కూడిన విద్యను అందించాలని, విద్యార్థినులకు ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించే విధంగా ఉపాధ్యాయునులు వ్యవహరించవలెనని సరియైన సమయపాలన పాటించి విద్యార్థులు అందరికీ విద్యాబోధన చేయవలెనని జిల్లా కలెక్టర్ విద్యార్థి సహకారం తో అన్ని కస్తూర్బా గాంధీ విద్యాలయాల్లో అవసరమైన మౌలిక వసతులను కల్పించడానికి కోసం కృషి చేస్తున్నామని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో రాజంపేట్ అర్బన్ కేజీబీవీ స్పెషల్ ఆఫీసర్ శ్రీ వాణిరిసోర్స్ పర్సన్ లు లక్ష్మి మరియు పుష్కలత పాల్గొన్నారు




