Thursday, 5 November 2026

ప్రశాంత వాతావరణంలో వినాయక నిమజ్జనం జరుపుకోవాలి.

సోదర భావంతోనే పండుగలు ప్రశాంతం.
400 మంది పోలీస్ సిబ్బందితో భారీ బద్దోబస్తూ…
జిల్లా ఎస్పీ ఎన్.కోటిరెడ్డి.
తాండూరు సెప్టెంబర్ 20(జనంసాక్షి)ప్రశాంత వాతావరణంలో వినాయక నిమజ్జనం జరుపు కోవాలని జిల్లా ఎస్పీ ఎన్.కోటిరెడ్డి పేర్కొన్నారు.
బుధవారం తాండూరు పట్టణం దుర్గాగార్డేన్స్ లో రాబోయే వినాయక నిమజ్జనం దృష్టిలోపెట్టుకొని పట్టణ సిఐ రాజేందర్ రెడ్డి ఆద్వర్యంలో శాంతి సమావేశం నిర్వహించారు.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జిల్లా ఎస్పీ ఎన్.కోట్ల రెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో వివిధ పార్టీల నాయకులు, వినాయక మండపాల నిర్వాకులు నిమజ్జనం రోజు పలు సమస్యలను అతిథుల దృష్టికి తీసుకువచ్చారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ ఎన్.కోటిరెడ్డి మాట్లాడుతూ వినాయక నిమజ్జ నం ప్రశాంతమైన వాతావరణంలో జరుపు కోవాల న్నారు.శాంతియుతంగా సోదర
భావంతో జరుపుకోవాలన్నారు.ఎలాంటి అవాంఛనీయ సంఘటనలకు తావివ్వకుండా
వినాయక నిమజ్జనం భక్తి శ్రద్ధలతో జరుపుకోవాలన్నారు. వినాయక నిమజ్జనం రోజు ఎలాంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా 400 మంది పోలీస్ సిబ్బందితో బందోబస్తు నిర్వహిస్తున్నట్లు తెలిపారు.
వినాయక నిమజ్జనం రోజు శాంతియుతంగా జరుపుకొని పోలీస్ శాఖ వారికి సహకరించాలని విజ్ఞప్తి చేశారు.ఈ కార్యక్రమంలో జిల్లా గ్రథాలయ సంస్థ చైర్మన్ రాజుగౌడ్ ,మున్నిపల్ చైర్ పర్సన్ స్వప్న పరిమళ్ ,ఆర్డీవో శ్రీనివాస్,వైస్ చైర్పర్స్ దిపా నర్సింహులు, ఎంపిపి ,గౌడి మంజుల, హిందూ ఉత్సవ సమితి ప్రధాన కార్యదర్శి పట్లోళ్ల నర్సింహులు,మైనార్టీ నాయకులు కుర్షిద్ ,కమళ్ అక్తర్,ఉత్సవ కమిటీ సభ్యులు, వినాయక మంటపాల నిర్వహకులు తదితరులు ఉన్నారు.