ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం ముందు అంగన్వాడీల నిరసన
టేకులపల్లి, సెప్టెంబర్ 20 (జనం సాక్షి ): టేకులపల్లి మండలం నుండి వందలాదిమంది అంగన్వాడి ఉద్యోగులు బుధవారం నిరవధిక సమ్మెలో భాగంగా 10 వ రోజు ఇల్లందు నియోజకవర్గ శాసన సభ్యురాలు బానోత్ హరిప్రియ ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయము నందు నిరసన తెలియజేసి డిమాండ్స్ తో కూడిన వినతి పత్రాన్ని అందజేశారు. ఈ కార్యక్రమంలో అంగన్వాడి అండ్ మినీ అంగన్వాడి ఆయాలు పాల్గొని తమ న్యాయమైన డిమాండ్లను తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ దృష్టికి పరిష్కారం అయ్యే విధంగా చర్చల ద్వారా తక్షణమే పరిష్కారమే అయ్యే విధంగా చూడాలని వినతి పత్రంలో కోరారు. న్యాయమైన డిమాండ్స్ అంగన్వాడీ ఉద్యోగులకు పర్మనెంట్ చేయాలి, కనీస వేతనం 26 వేల రూపాయలు ఇవ్వాలి, గ్రాటివిటీ అమలు చేయాలని, రిటైర్మెంట్ బెనిఫిట్ అంగన్వాడీ టీచర్లకు 10 లక్షలు ఆయాలకు, ఐదు లక్షలు పెన్షన్ సౌకర్యం కల్పించాలని తదితర ముఖ్యమైన డిమాండ్లతో కూడిన వినతి పత్రాన్ని ఎమ్మెల్యేకి అందజేశారు. ఈ కార్యక్రమంలో ఏఐటీయూసీ కార్మిక నాయకురాలు వై ఇందిరా,వై పద్మావతి, వి సంధ్యారాణి, బిచ్చాలి, సిఐటియు కార్మిక నాయకులు శకుంతల, కే భద్రమ్మ,పద్మ, విజయలక్ష్మి, నాగమణి, సిపిఐ జిల్లా నాయకులు దేవరకొండ శంకర్, గుగులోతు రామ్ చందర్,సిపిఎం జిల్లా నాయకులు ఎస్.కె నభి,ఆర్ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు




