కదం తొక్కిన అంగన్వాడీలు..
ఏఐటీయూసీ ఆధ్వర్యంలో కలెక్టరేట్ ముట్టడి.
రాజన్న సిరిసిల్ల బ్యూరో. సెప్టెంబర్ 20.(జనంసాక్షి). అంగన్వాడి టీచర్ల హెల్పర్ల డిమాండ్లు పరిష్కరించాలని కోరుతూ జయంతి యాక్షన్ కమిటీ ఆధ్వర్యంలో నిరవధిక దీక్షలు కొనసాగుతున్నాయి. బుధవారం ఏఐటీయూసీ ఆధ్వర్యంలో అంగన్వాడీ టీచర్లు హెల్పర్లు కతంతోక్కారు కలెక్టరేట్ ముట్టడించి ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా ఏఐటీయూసీ జిల్లా అధ్యక్షులు కడారి రాములు , యూనియన్ నాయకులు మాట్లాడుతూ నిరవధికంగా దీక్షలు చేస్తున్న అంగన్వాడీల సమస్యల పట్ల ప్రభుత్వం స్పందించకపోవడంపై మండిపడ్డారు. గతంలో ప్రభుత్వం అంగన్వాడీ టీచర్లకు హెల్పర్లకు ఇచ్చిన హామీలు అమలు చేయకపోవడం పట్ల ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం అంగన్వాడీలకు ఇచ్చిన హామీలను అమలు చేసి సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేశారు. అంగన్వాడి టీచర్లు హెల్పర్లు చేసిన నినాదాలతో కలెక్టరేట్ దద్దరిల్లిపోయింది. అనంతరం నాయకులు డిమాండ్లతో కూడిన వినతి పత్రాన్ని అధికారులకు అందజేశారు నిరసన కార్యక్రమంలో అంగన్వాడి టీచర్స్ హెల్పర్స్ యూనియన్ నాయకులు, అన్ని మండలాల నుండి టీచర్లు హెల్పర్లు పాల్గొన్నారు.




