అంగన్ వాడి టీచర్ల న్యాయమైన డిమాండ్లను పరిష్కారించాలి.
కాంగ్రెస్ పార్టీ తాలూకా కో ఆర్డినేటర్ జెడ్పి చైర్ పర్సన్ సరిత.
గద్వాల నడిగడ్డ, సెప్టెంబర్ 20 (జనం సాక్షి);
జోగులాంబ గద్వాల జిల్లా కేంద్రంలోని కలెక్టర్ కార్యాలయం ఎదురుగా సిఐటియు అధ్వర్యంలో అంగన్వాడీ ఉద్యోగుల నిరవధిక ధర్నా కార్యక్రమానికి కాంగ్రెస్ పార్టీ తాలూకా కో ఆర్డినేటర్ జెడ్పి చైర్ పర్సన్ సరితమ మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా జెడ్పి చైర్ పర్సన్ మాట్లాడుతూ అంగనవాడీ ఉద్యోగులను పర్మినెంట్ చేయాలని,కనీస వేతనం 26,000/- రూపాయలు ఇవ్వాలని,గ్రాట్యూడీ రిటైర్డ్ బెన్పిస్ట్,పెన్షన్ ఇఎస్ఐ,ఉద్యోగ భద్రతా కల్పించాలని ఇతర న్యాయ పరమైన సమస్యలను పరిష్కరించాలని పోరాడుతున్న మహిళల పట్ల కేసీఆర్ ప్రభుత్వం నిర్లక్ష్య వైఖరి వీడి వెంటనే అంగన్వాడీ ల సమస్యలను పరిష్కరించాలని ప్రభుత్వాన్ని సరిత డిమాండ్ చేశారు.కాంగ్రెస్ పార్టీ నాయకులు శ్రీనివాస్ గౌడ్, అల్వాల రాజశేఖరరెడ్డి, ఇమ్మానేయిల్, పెద్దపల్లి శివ,రఫీ, మధు,సిఐటియు నాయకులు వెంకటస్వామి, వి.వి.నరసింహ, ఏమ్మేలమ్మ, అరుణజ్యోతి,సీతక్క,సలోని,ఫరిధ,సుమిత్ర, అదిలక్ష్మీ తదితరులు ఉన్నారు.




