Wednesday, 4 November 2026

కలెక్టర్, ఐసిడిఎస్ అధికారులు వేధిస్తున్నారు
* సిఐటియు జిల్లా ఉపాధ్యక్షురాలు వెంకటమ్మ

టేకులపల్లి, సెప్టెంబర్ 20 (జనం సాక్షి ): అంగన్వాడి ఉద్యోగులు శాంతియుతంగా వారి న్యాయమైన డిమాండ్ల కోసం నిరవధికంగా సమ్మె చేస్తున్న క్రమంలో జిల్లా కలెక్టర్, ఐసిడిఎస్ అధికారులు వేధింపులకు గురి చేస్తున్నారని సిఐటియు జిల్లా ఉపాధ్యక్షురాలు ఈసం వెంకటమ్మ అన్నారు. టేకులపల్లి మండల కేంద్రంలోని స్థానిక తహసీల్దార్ కార్యాలయం ముందు అంగన్వాడీలు నిరవధికంగా సమ్మె చేస్తున్న క్రమంలో బుధవారం ఆమె10వ రోజు సమ్మె శిబిరాన్ని సందర్శించి సంఘీభావం తెలిపారు.
గత పదిరోజులుగా తమ న్యాయమైన డిమాండ్ల సాధనకు సమ్మె చేస్తున్న అంగన్వాడీ ఉద్యోగులంతా సీఐటియు, ఏఐటీయుసి ల అధ్వర్యంలో సమ్మె చేస్తున్న క్రమంలో కలెక్టర్, ఐసిడీఎస్ అధికారులు వేధిస్తున్నారని, ఈ విషయం చెప్పు కోడానికి ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయానికి వెళితే పోలీసులు ఇబ్బందులకు గురి చేస్తున్నారని ఆరోపించారు.ఈ ఈ సమ్మె లో కొండపల్లి శకుంతల, సాల్కిబాయి ఇందిరా,భారతి, విజయలక్ష్మి, రాజేశ్వరి తదితరులు పాల్గొన్నారు.