Wednesday, 4 November 2026

వినాయక మండపం ఎదుట
మైనార్టీ నాయకుల అన్నదానం

వనపర్తి బ్యూరో సెప్టెంబర్ 20 (జనంసాక్షి)

జిల్లా కాంగ్రెస్ మైనార్టీ నాయకులు బుధవారం జిల్లా కేంద్రంలోని న్యూటౌన్ కాలనీలో కొలువుదీరిన మహాదేవ్ వినాయక చవితి మండపం ఎదుట మహిళలు ప్రత్యేకించి పూజలు చేసిన అనంతరం కాంగ్రెస్ మైనార్టీ నాయకులు అన్నదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా వినాయక మండపాల వద్ద మైనార్టీ నాయకులు అన్నదానం చేయడం పట్ల భక్తులు హర్ష వ్యక్తం చేశారు. హిందూ ముస్లింల ఐక్యత చాటేలా భాగంగానే అన్నదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినట్లు కాంగ్రెస్ మైనార్టీ నాయకులు తెలిపారు. ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలని వినాయకుని ప్రార్థించినట్లు వారు వెల్లడించారు. కార్యక్రమంలో మైనార్టీ జిల్లా అధ్యక్షుడు సమ్మద్ మియా, నాయకులు మీర్జా మునిర్, సయ్యద్ భాష , గౌస్ బీన్, సులేమాన్, కాంగ్రెస్ పట్టణ అధ్యక్షుడు చీర్ల విజయ్ చందర్. నిర్వాహకులు టింకు యాదవ్, చరణ్సాగర్, శశాంక్ సాగర్, గోపికృష్ణ, అక్షిత్, రామ్ చరణ్, రిషి, గౌతమ్ మరియు న్యూటన్ కాలనీ వాసులు తదితరులు పాల్గొన్నారు