కాంగ్రెస్ పార్టీలోకి చేరికలు
జనంసాక్షి, మంథని : పెద్దపల్లి జిల్లా మంథని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో మంథని మండలం ఎగ్లాస్ పూర్ గ్రామానికి చెందిన బిజెపి ఎస్సీ సెల్ అధ్యక్షులు మంథని లింగయ్య, మంథని స్వరూప, బిఆర్ఎస్ నాయకులు మారపెల్లి శంకర్, రాజేశం తదితరులు ఏఐసీసీ కార్యదర్శి దుద్దుల్ల శ్రీధర్ బాబు సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. వారికి శ్రీధర్ బాబు కాంగ్రెస్ పార్టీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. రాబోయేది కాంగ్రెస్ ప్రభుత్వమే అని, ప్రతీ ఒక్క కార్యకర్త సైనికుల పని చేయాలని ఎమ్మెల్యే శ్రీధర్ బాబు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు తొట్ల తిరుపతి యాదవ్, మంథని మండల అధ్యక్షులు ఆయిలి ప్రసాద్, వర్కింగ్ ప్రెసిడెంట్ బూడిద శంకర్, పేరవేన లింగయ్య యాదవ్. ఎస్సీ సెల్ మంథని డివిజన్ అధ్యక్షులు మంథని సత్యం, ఎస్సీ సెల్ మంథని మండల అధ్యక్షులు మంథని రాకేష్, మంథని మండలం ఎస్సీ సెల్ ఉపాధ్యక్షులు ఆర్ల నారాయణ. అర్థం లింగమూర్తి. అధికార ప్రతినిధి తోకల మల్లేష్, యూత్ కాంగ్రెస్ నాయకులు రాధారపు నితీష్. సోషల్ మీడియా కో కోఆర్డినేటర్ పంచిక దేవేందర్. ఎస్సీ సెల్ మంథని డివిజన్ ఉపాధ్యక్షులు మంథని సమ్మయ్య తదితరులు పాల్గొన్నారు.




