Wednesday, 4 November 2026

నూరు శాతం రాయితీపై ఉచిత చేప పిల్లల పంపిణీ
* మత్స్యకారులు సద్వినియోగం చేసుకోండి
* ఇల్లందు ఎమ్మెల్యే బానోతు హరిప్రియ నాయక్

టేకులపల్లి, సెప్టెంబర్ 20 (జనం సాక్షి): తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సమీకృత మత్స్య అభివృద్ధి పథకం ద్వారా మత్స్యకారులకు నూరు శాతం రాయితీపై ఉచిత చేప పిల్లలను అందిస్తుందని సద్వినియోగం చేసుకోవాలని ఇల్లందు ఎమ్మెల్యే బానోత్ హరిప్రియ నాయక్ సూచించారు. బుధవారం టేకులపల్లి మండలం ఎంపీడీవో కార్యాలయం నందు సమీకృత మత్స్య అభివృద్ధి పథకం ద్వార 100 శాతం రాయితీ పై ఉచిత చేప పిల్లలు పంపిణి కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ఎమ్మెల్యే పాల్గొని ఆమె చేతుల మీదుగా పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ దిండిగల రాజేందర్, ఎంపీపీ భూక్య రాధా,ఎంపీడీవో వీరబాబు, పార్టీ మండల అధ్యక్షులు బొమ్మెర్ల వరప్రసాద్, మండల ప్రధాన కార్యదర్శి బోడ బాలు నాయక్, జిల్లా నాయకులు బానోత్ రామా నాయక్, మండల అధికార ప్రతినిధి బానోత్ కిషన్ నాయక్,స్థానిక ఎంపీటీసీ అప్పారావు, దళపతి శ్రీనివాసరావు, కాలే ప్రసాద్ రావు, రామయ్య, సులానగర్ ఉప సర్పంచ్ ఉండేటి బసవయ్య, జాటోత్ నరేష్, బానోత్ రవి, గుగులోతు కృష్ణ,కుమ్మరి కిరణ్, ముచ్చ జయరాజు తదితరులు పాల్గొన్నారు.