Wednesday, 4 November 2026

ర్యాగింగ్ కు పాల్పడితే కఠిన చర్యలు.
యువత సైబర్ నేరాల పట్ల అవగాహన కలిగి ఉండాలి.
జిల్లా అడిషనల్ ఎస్పీ సి.హెచ్ రామేశ్వర్.

నాగర్ కర్నూల్ జిల్లా బ్యూరో,జనంసాక్షి:
కళాశాలల్లో విద్యార్థినీలపై ర్యాగింగ్ లకు పాల్పడితే చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని,అలాగే బస్ స్టాప్ లలో, నిర్మానుష్య ప్రాంతాల్లో అమ్మాయిలను ఎవరైనా వేధింపులకు గురిచే సినట్లూ అయితే వెంటనే జిల్లా షీ టీం పోలీస్ హెల్ప్ లైన్ నెంబర్ 8712657676 లేదా డయల్ 100 కాల్ చేసి పోలీసువారికి సమాచారం ఇవ్వాలని నాగర్ కర్నూల్ జిల్లా అడిషనల్ ఎస్పీ సి.హెచ్ రామేశ్వర్ తెలిపారు.
బుధవారం జిల్లా కేంద్రంలోని మెడికల్ కళాశాలలో జరిగిన ప్రేషర్స్ డే కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు.ఈ సందర్భంగా పోలీసు శాఖ ఆధ్వర్యంలో షి టిమ్ అవగాహన కార్యక్రమం నిర్వహించారు.ఈ సందర్భంగా విద్యార్థులకు ఈవ్ టీజింగ్, ర్యాగింగ్, అమ్మాయిలను వేధింపులు, చదువుపై శ్రద్ధ, గోల్ సెట్టింగ్, సెల్ ఫోన్ వినియోగం వల్ల ఏర్పడే అనార్థాలు మొదలగు విషయాలపై అవగాహన కల్పించారు.అడిషనల్ ఎస్పీ విద్యార్థినిలతో మాట్లాడుతూ ఎటువంటి విషయాలు ఉన్న తల్లిదండ్రుల ద్యారా ధైర్యంగా పోలీసు వారికి సమాచారం ఇవ్వాలని తెలిపారు. విద్యార్థినిలు నేటి కాలంలో సెల్ ఫోన్ వినియోగం ఎక్కువైందని చాలామంది సోషల్ మీడియాకు అలవాటుపడి సమయాన్ని వృధా చేసుకోవడం జరుగుతుందని ఆవేదన వ్యక్తం చేశారు.సమయాన్ని వృదా చేయకుండా చదువుపై శ్రద్ధ కనబరచాలని సూచించారు.దేశ భవిష్యత్ ను తీర్చిదిద్దేది యువతేనని, చెడు వ్యసనాలకు బానిసై బంగారు భవిష్యత్ ను పాడుచేసుకోవద్దని అన్నారు.ర్యాగింగ్ అనేది ఒక విష సంస్కృతి అని విద్యార్థులు దాన్ని విడనాడి, జీవితంలో ఉన్నతంగా ఎదిగి, తల్లిదండ్రుల కు మంచి పేరు తీసుకురావాలని సూచించారు.యువత సైబర్ నేరాల పట్ల అవగాహన కలిగి ఉండాలన్నారు.18 ఏళ్లు నిండి లైసెన్స్ పొందిన వాళ్లు మాత్రమే వాహనాలు నడపాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో మెడికల్ కళాశాల ప్రిన్సిపల్ రమాదేవి, నాగర్ కర్నూల్ సీఐ విష్ణు వర్ధన్ రెడ్డి,జిల్లా షి టీమ్ ఇంచార్జీ ఏ ఎస్సై విజయలక్ష్మి,షి టీమ్ సిబ్బంది వెంకటయ్య, వెంకట్ నాయక్ మరియు విద్యార్థులు పాల్గొన్నారు.