Wednesday, 4 November 2026

మహిళా కౌన్సిలర్ నాయిని పూర్ణ చందర్ అరుణను అరెస్టు ను నిరసిస్తూ మున్సిపల్ కార్యాలయం ముందు నిరసన ధర్నా
–పోత్నక్

భువనగిరి టౌన్ (జనం సాక్షి):–
డ్రైనేజీ సమస్య కొరకు పురపాలక సంఘ కార్యాలయంలో శాంతియుతంగా నిరసన తెలియజేయడానికి కార్యాలయమునకు వచ్చినటువంటి నాలుగో వార్డ్ అధికార పార్టీ కౌన్సిలర్ నాయిని అరుణ పూర్ణచందర్ గారిని పోలీసుల అండతో అరెస్టు చేయించడానికి నిరసిస్తూ నేడు భువనగిరి కాంగ్రెస్ పార్టీ మున్సిపల్ కౌన్సిలర్ల ఆధ్వర్యంలో మున్సిపల్ కార్యాలయం ముందు నిరసన తెలియజేస్తూ ధర్నా చేయడం జరిగింది. అనంతరం కౌన్సిలర్ నాయిని అరుణ పూర్ణచందర్ గారిని కలిసి వారిని పరామర్శించి ఈ సమస్య వారం రోజుల్లో30 మీటర్ల డ్రైనేజ్ పైప్ లైన్లో నిర్మాణం చేయకపోతే పెద్ద ఎత్తున ఉద్యమిస్తామని అన్నారు.
ఇట్టి కార్యక్రమంలో పాల్గొన్నటువంటి పిసిసి ప్రధాన కార్యదర్శి పోతన్న ప్రమోద్ కుమార్ మాట్లాడుతూ ప్రజల చేత ఎన్నుకోబడినటువంటి ప్రజాప్రతినిధులు ప్రజల సమస్యల కొరకు పోరాటం చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంటుందని ప్రజల సమస్యలను పరిష్కరించడం కొరకు కార్యాలయంలో శాంతియుతంగా నిరసన తెలియజేస్తే పోలీసుల అండలతో అరెస్టు చేయించడం శోచనీయమని సిగ్గుచేటని మహిళా కౌన్సిలర్ అని చూడకుండా అరెస్టు చేసి పోలీస్ స్టేషన్కు తరలించడం ఎంతవరకు సమంజసం అని అధికార పార్టీకి చెందినటువంటి చైర్మన్ మరియు ఎమ్మెల్యేను ప్రశ్నించడం జరిగింది.
ప్రజల సమస్యలను తెలియజేయడం కోసం మున్సిపల్ కార్యాలయానికి వచ్చినటువంటి మామూలు పౌరుడిని అయినా గౌరవించి సమస్యను వినే విధంగా పరిష్కరించే విధంగా చైర్మన్ మరియు కమిషనర్లు కలిసి సమస్యను పరిష్కరించాల్సిన బాధ్యత వారిపై ఉన్నదని మరిచి అధికార అహంతో మహిళా కౌన్సిలర్ను ఇబ్బంది పెట్టడం వారి విజ్ఞతకే దీనిపైన తక్షణమే ఎమ్మెల్యే పైళ్ల శేఖర్ రెడ్డి సమాధానం చెప్పాల్సిన బాధ్యత ఆయనపై ఉందన్నారు
తక్షణమే నాలుగో వార్డు రాగిర్ ప్రాంతంలో ఉన్నటువంటి మురికి కాలువ సమస్యను పరిష్కరించే విధంగా నిధులు కేటాయించి పనులను ప్రారంభించి ప్రజా సమస్యలను తీర్చాల్సిన బాధ్యత ఎమ్మెల్యే స్వీకరించాలని డిమాండ్ చేశారు.
ఇట్టి కార్యక్రమంలో మాజీ మున్సిపల్ చైర్మన్ బర్రె జాంగిర్ 26వ వార్డు కౌన్సిలర్ వీరపాక నరసింహ 27 వార్డ్ కౌన్సిలర్ నజీమా నస్రిన్ సలావుద్దీన్ 28వ వార్డ్ కౌన్సిలర్ కైరం కొండ వెంకటేష్ 19వ వార్డ్ కౌన్సిలర్ వడిచర్ల లక్ష్మి కృష్ణ యాదవ్ 34 వ వార్డు కౌన్సిలర్ కోళ్ల దుర్గా గంగాభవాని నాయకులు గ్యాస్ చిన్న కాలియా నాగరాజ్ బట్టు సందీప్ వడిచర్ల శరత్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు.