రిజర్వాయర్ వద్ద గణేష్ నిమజ్జనం రోజు జాగ్రత్త వహించాలి
జనం సాక్షి , కమాన్పూర్: ప్రజా క్రాంతి సెప్టెంబర్ 21 : గణేష్ నిమజ్జనం రోజున రిజర్వాయర్ వద్ద జాగ్రత్తలు వహించాలని కమాన్ పూర్ తహసిల్దార్ వంగా మోహన్ రెడ్డి గోదావరిఖని టూ టౌన్ సిఐ సూరం వేణుగోపాల్ కోరారు. కమాన్ పూర్ మండలంలోని గుండారం రిజర్వాయర్ గణేశుని నిమజ్జనం చేసే ప్రదేశాన్ని గురువారం అధికారులు పరిశీలించారు. ఈనెల 29న జరిగే గణేష్ నిమజ్జన ఉత్సవాలను పురస్కరించుకొని గుండారం రిజర్వాయర్లో గణేష్ విగ్రహాలను నిమజ్జన చేయనున్న నేపథ్యంలో రిజర్వాయర్ వద్ద చేపట్టే ఏర్పాట్లను అధికారులు పరిశీలించారు . నిమజ్జనం రోజున ప్రతి ఒక్కరూ జాగ్రత్తగా ఉండాలని గజ ఈతగాళ్లను అందుబాటులో ఉంచాలని కోరారు. కమాన్ పూర్ తహసిల్దార్ వంగ మోహన్ రెడ్డి గోదావరిఖని టూ టౌన్ సీఐ సూరం వేణుగోపాల్, కమాన్ పూర్ ఎస్సై బేతు రాములు, ఎంపీడీవో విజయ్ కుమార్, ఎంపీపీ రాచకొండ లక్ష్మి రవి, సర్పంచ్ ఆకుల ఓదెలు, ఎం పి ఓ శేషయ్య సూరి గిదావర్ సంధాని ఉపసర్పంచ్ రాచకొండ చంద్రమౌళి ఉన్నారు.




