Thursday, 5 November 2026

మరణాంతరం దేహదానానికి అంగీకారం

జనంసాక్షి , మంథని : పెద్దపల్లి జిల్లా మంథని పట్టణ నివాసి మద్దుకూరు బాపయ్య ఆయన సతీమణి కనక దుర్గాబాయి దంపతులు బ్రతికి ఉండగానే, మంథని సదాశయ ఫౌండేషన్ కన్వీనర్ ప్రకాష్ రెడ్డికి వారి మరణానంతరం దేహదానం చేస్తామని అంగీకార పత్రాలపై సంతకాలు చేసి ఇచ్చారు. దాని ప్రకారం బాపయ్య చనిపోగానే భార్య ప్రకాశరెడ్డికి తెలియపర్చింది. కుటుంబ సభ్యుల అంగీకారంతో సదాశియ ఫౌండేషన్ లైన్స్ క్లబ్ ఆఫ్ కమాన్పూర్ ఆధ్వర్యంలో బాపయ్య పార్థీవ దేహాన్ని రామగుండము సిమ్స్,మెడికల్ కాలెజి వారికి అప్పగించడం జరిగింది. మంథని పట్టణం నుండి రామగుండము మెడికల్ కాలేజీకి దేహం వచ్చేవరకు పాటు పడి లింగమూర్తి, వాసు,రమేష్ , చంద్రమౌళి లయన్ సానా రామకృష్ణారెడ్డి, ఎస్ శంకర్ త్రివేది లా సారధ్యంలో అప్పగించారు. కుమారులు కోడండ్లు రఘుబాబు, రాధ.. సతీష్ బాబు,ఝాన్సీ …భార్య కనక దుర్గాబాయి కు ,నేత్రసేకరణ చేసిన ఆరీఫ్ కి, మంథని కన్వీనర్ ప్రకాష్ రెడ్డికి పాల్గొన్న ప్రముఖులు ప్రత్యేక అభినందనలు, ధన్యవాదాలు తెలిపారు