కాంగ్రెస్ గ్యారంటీ కార్డ్స్ పోస్టర్ లను ఆవిష్కరించిన కాంగ్రెస్ నాయకులు
జనంసాక్షి, కమాన్ పూర్ : పెద్దపల్లి జిల్లా కమాన్ పూర్ మండల కేంద్రంలో ఏఐసీసీ సెక్రెటరీ మంథని ఎమ్మెల్యే శ్రీధర్ బాబు ఆదేశాల మేరకు స్థానిక అంబేద్కర్ చౌరస్తాలో తుక్కుగూడలో కాంగ్రెస్ పార్టీ అగ్రనేతలు ప్రకటించిన కాంగ్రెస్ పార్టీ గ్యారంటీ కార్డ్స్ పథకాల పోస్టర్ ను మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైనాల రాజు ఆవిష్కరించారు. సందర్భంగా ఆయన మాట్లాడుతూ… రాబోయే ఎన్నికల్లో అధికారంలోకి రాగానే 6 గ్యారంటీ హామీలను కాంగ్రెస్ పార్టీ అమలు చేసి తీరుతుందని అన్నారు. తెలంగాణ రాష్ట్రం ఇచ్చిన కాంగ్రెస్తోనే తెలంగాణ అభివృద్ధి సాధ్యమన్నారు. మేనిఫెస్టో కమిటీ చైర్మన్ మంథని ఎమ్మెల్యే శ్రీధర్ బాబు ఆధ్వర్యంలో రూపకల్పనలో తెలంగాణ దేవత సోనియా గాంధీ చేతుల మీదుగా ఆవిష్కరించబడినటువంటి తెలంగాణ కాంగ్రెస్ ప్రజా మేనిఫెస్టో అని అన్నారు. ప్రతి ఇంటిలోని ఆడబిడ్డకు నెలకు 2500 ఇవ్వడం జరుగుతుందని, ప్రతి గ్యాస్ కనెక్షన్ కు 500 రూపాయలకే ఇవ్వడం జరుగుతుందని, ప్రతి వృద్ధునికి పెన్షన్ రూపంలో చేయిత ద్వారా నెలకు 4000 అందించడం జరుగుతుందని, ఆరోగ్యశ్రీ పథకం ద్వారా ఆరోగ్య భీమా కింద ప్రతి ఒక్కరికి పది లక్షల రూపాయల ఇన్సూరెన్స్ ఉందని, ప్రతి చదువుకునే నిరుపేద విద్యార్థికి ఫీజు రీయింబర్స్మెంట్ ద్వారా ప్రభుత్వమే పూర్తిగా భరిస్తుందని, తెలంగాణ ప్రజల జీవన ప్రమాణాలు పెంచే జాతి నిర్మాణం కోసం పనిచేసే ఏకైక పార్టీ కాంగ్రెస్ పార్టీ అని అన్నారు. ఆనాడు తెలంగాణ రాష్ట్ర ఇస్తామని సోనియాగాంధీ ప్రకటన చేసి ఆ మాట నిలబెట్టుకున్న దేవత సోనియా గాంధీ అని, ఆనాడు తెలంగాణ బిల్లును అసెంబ్లీలో ప్రవేశపెట్టిన నాయకుడు శ్రీధర్ బాబు అని, నేడు సైతం మేనిఫెస్టో రూపకల్పన చైర్మన్ గా శ్రీధర్ బాబు మేనిఫెస్టో అమలు బాధ్యతగా సోనియా గాంధీ తెలంగాణ ప్రజలకు ఇచ్చిన మాట నెరవేర్చే క్రమంలో ముందు వరుసలో ఉంటారని అన్నారు. ఈ ప్రజా మేనిఫెస్టో తెలంగాణ ప్రజల అవసరాలకు అనుగుణంగా మేదో మధనం చేసి ప్రజల కోసం చేసిందని దీనితో అవినీతి కేసీఆర్ పాలన అంతం కావడం తత్యమని అన్నారు. ఈ కార్యక్రమంలో భాద్రపు శంకర్, సయ్యధ్ ఇక్బాల్ ,ఎండి అఫ్సర్, కొంతం శ్రీనివాస్, ఈరుగురాల శేకర్, అంజి, దాసరి గట్టయ్య , చొప్పరి షేకర్, అబ్దుల్ రఫీక్,పెండ్యాల రాజు ,కుక్క రవి, బొజ్జ సతీష్, పిడుగు విష్ణు, మతీన్,శ్రీనివాస్, బుర్ర సత్యం గౌడ్,పిడుగు వెంకటేష్ ,వంగల విజయ్,రహీం, ఛాట్లా రాయమల్లు, రమేష్ తదితరులు ఉన్నారు.




