జనయేత్రీ ఫౌండేషన్ ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం
మిర్యాలగూడ, జనం సాక్షి.
జనయేత్రి ఫౌండేషన్ వ్యవస్థాపకులు డా మునిర్ అహ్మద్ షరీఫ్ పిలుపుతో మిర్యాలగూడ పట్టణంలోని జనయే త్రి ఫౌండేషన్ కార్యాలయం దగ్గర
యువకులు మహిళలు స్వచ్చందంగా రక్తదానం ఇచ్చారు. ఈ సందర్భంగా డా.మునిర్ అహ్మద్ షరిఫ్ మాట్లాడుతూ తలసేమియా కిడ్ని సమస్యలతో భాదపడే వారికొసం గర్భిణీ స్త్రీలు అపరేషన్ అప్పుడు రక్తం లేక ఇబ్బంది పడుతున్నా వారికోసం అందుబాటులో రక్తం ఉండాలని నేడు మా జనయేత్రి ఫౌండేషన్ ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం ఏర్పాటు చేశామన్నారు.
ఈ కార్యక్రమం లో ముఖ్య అతిథులుగా పాల్గోన్నా కేరళీ స్కూల్ ప్రిన్సిపాల్ హైమద్ మాట్లాడుతూ మనం రోజు మీడీయా లో పేపర్ లో చూస్తూంటాం రోడ్డు ప్రమాదంలో త్రీవంగా గాయపడి
చికిత్స పొందుతూ రక్తం సరియైన సమయంలో అందక ఎందరో ప్రాణాలు విడిచారని
అలాంటి అత్యవసర పరిస్థితుల్లో రక్తం అందుబాటులో ఉండాలని
ఏ ఒక్క పేషేంట్ రక్తం దొరకలేదు అనే కారణంతో తనువు చాలించకూడదని జనయేత్రి ఫౌండేషన్ వారి ఆధ్వర్యంలో రక్తదానం నిర్వహించడం అభినందనీయం అన్నారు. ఈ కార్యక్రమంలో జనయేత్రి ఫౌండేషన్ సభ్యులు
తాజ్ బాబ మాట్లాడుతూ
ఈరోజు చాల స్పెషల్
మా జనయేత్రి ఫౌండేషన్ వ్యవస్థాపకులు డా.మునిర్ అహ్మద్ షరీఫ్ వివాహ దినోత్సవం అలాగే ప్రపంచ శాంతి దినోత్సవం పురస్కరించుకుని రక్తదాన శిబిరం ఏర్పాటు చేయడం
కేవలం ఒక వాట్సాప్ మెసేజ్ ద్వారా 32 మంది రక్తదాతలు సృందించి స్వచ్చందంగా రక్తదానం చేసేందుకు ముందుకు రావడం అభినందనీయం అన్నారు
ఈ కార్యక్రమం లో పాల్గొన్న ప్రతి యొక్క రక్తదాతకూ ధన్యవాదాలు తెలియజేశారు.చేసుకుంటున్నా రు. ఈ కార్యక్రమంలో జనయేత్రీ ఫౌండేషన్ వర్కింగ్ ప్రెసిడెంట్ పోగుల సందిప్, వరలక్ష్మి, మదీహ, జరీనా ,నాగరాణి , శీవలీల గారు యాదగిరి శ్రీనివాస రెడ్డి సాయి షహీర్
ఫహీం అమీర్అలి షేరోజ్ అవిరేండ్ల సందిప్ పోగుల నవీన్ లీంగరాజు విజయ్ కుమార్ ఫ్రెండ్స్ ఫస్ట్ ఎయిడ్ సెంటర్ సిబ్బంది మరియు, ఫ్రెండ్స్ ఫౌండేషన్ సభ్యులు, మిర్యాలగూడ గవర్నమెంట్ హస్పటల్ సిబ్బంది మరియు డాక్టర్ మౌనిక పాల్గొన్నారు.




