Thursday, 5 November 2026

అర్హులందరికీ గృహలక్ష్మి కింద ఇల్లు మంజూరు చేయాలి
– విలేకరుల సమావేశంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు వైనాల రాజు డిమాండ్

జనంసాక్షి, కమాన్ పూర్ : పెద్దపల్లి జిల్లా కమాన్పూర్ మండలంలోని గృహలక్ష్మి పథకానికి సంబంధించి అర్హులైన 1210 మంది లబ్ధిదారులకు గాను కేవలం 74 మందికి మాత్రమే గృహలక్ష్మిలో అవకాశం కల్పించినట్టుగా అధికార పార్టీ ఒత్తిళ్లకు తలోగ్గి ప్రోసిడింగ్లు రిలీజ్ చేయడం జరిగిందని కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు వైనాల రాజు ఆరోపించారు. గురువారం కమాన్ పూర్ ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రతి లబ్ధిదారునికి గృహలక్ష్మి ద్వారా ఇంటి నిర్మాణానికి లబ్ధి చేకూరుతుందని గొప్పలు పలికిన జడ్పీ చైర్మన్ పుట్ట మధు.. విడుదలైన గృహలక్ష్మి జీవో తో ఆయన నిజ స్వరూపం బట్టబయలైంది విమర్శించారు. నీకు ఓట్లేసి గెలిపించిన కమాన్పూర్ మండలానికి ప్రతి స్కీములో కోత పెట్టడం శోచనీయమన్నారు. కమాన్పూర్ మండలాన్ని మూడు ముక్కలు చేసి, కమాన్పూర్ మండల రాజకీయ, ఆర్థిక భవిష్యత్తును నాశనం చేశారని ఆరోపించారు. 300 మంది అర్హులైన మైనార్టీ లోన్లకు సంబంధించి కేవలం ఇద్దరికీ మాత్రమే లోన్ ఇవ్వడం జరిగిందని , 584 మంది బీసీ లబ్ధిదారులు ఉండగా కేవలం 24 కి మంది మాత్రమే లోన్ ఇవ్వడం జరిగిందన్నారు. 1400 కుటుంబాలు దళిత బందుకు అర్హులుగా ఉండగా కేవలం 90 మందికి మాత్రమే దళిత బంధువులు ఇవ్వడం జరిగిందని, 1210 మంది గృహలక్ష్మికి అర్హులుగా తీర్చగా కేవలం 74 మందికి మాత్రమే ఇవ్వడం జరిగిందన్నారు. ఈ విలేకరుల సమావేశంలో కాంగ్రెస్ నాయకులు భాద్రపు శంకర్, సయ్యడ్ ఇక్బాల్ ,ఎండి అఫ్సర్, కొంతం శ్రీనివాస్,ఈరుగురాల శేకర్,అంజి, దాసరి గట్టయ్య ,చొప్పరి షేకర్, అబ్దుల్ రఫీక్,పెండ్యాల రాజు ,కుక్క రవి, బొజ్జ సతీష్, పిడుగు విష్ణు, మతీన్,శ్రీనివాస్, బుర్ర సత్యం గౌడ్,పిడుగు వెంకటేష్ ,వంగల విజయ్, రమేష్, చాట్ల రాయమల్లు రమేష్ తదితరులు ఉన్నారు.