కొండ లక్ష్మణ్ బాపూజీ కి కాంగ్రెస్ నాయకుల నివాళులు
జనంసాక్షి, కమాన్ పూర్ : పెద్దపల్లి జిల్లా కమాన్పూర్ మండల కాంగ్రెస్ పార్టీ కార్యలయములో ప్రముఖ స్వాతంత్య్ర సమరయోధులు, తెలంగాణా తొలితరం ఉద్యమ నాయకులు, బలహీన వర్గాల ఆశాజ్యోతి కొండ లక్ష్మణ్ బాపూజీ వర్ధంతి సందర్భంగా మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైనాల రాజు ఆధ్వర్యంలో కాంగ్రెస్ నాయకులు ఘన నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.




